ఆ డైలాగులు నచ్చవంటున్న సుక్కు

Update: 2018-04-09 03:29 GMT
ఇప్పటి సినిమాల్లో డైలాగులు అంటే.. పంచ్ లు పేల్చడమే పరమావధి అయిపోయింది. ప్రతీ ఒక్కళ్లూ ఏదో ఒక కౌంటర్ వేస్తూ డైలాగ్స్ చెప్పడం పరిపాటిగా కనిపిస్తోంది. కొన్ని సినిమాల్లోను.. కొందరు డైరెక్టర్లు రాసే వాటిలోనూ ఈ వన్ లైనర్స్ బాగానే పేలుతున్నాయి. కానీ చాలామంది వీటి చుట్టూనే డైలాగ్స్ రాసుకుంటున్నారు.

కానీ తనకు మాత్రం ఇలాంటి డైలాగ్స్ పై అంతగా నమ్మకం లేదంటున్నాడు దర్శకుడు సుకుమార్. రీసెంట్ గా వచ్చిన రంగస్థలం సహా.. తన గత చిత్రాలలో వేటిలోను వీటి గురించి అసలు ఆలోచించలేదని చెప్పాడు సుక్కు. అసలు తన స్టైల్ అది కాదన్నది సుక్కు వెర్షన్. కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్లాడుతా చిత్రంతో పాటు రాంగోపాల్ వర్మ సినిమాలు తనకు ఇన్ స్పిరేషన్ అంటున్న సుక్కు.. ఆయా సినిమాల్లో అలాంటివేమీ ఎక్కడో కాని తగలవనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు.

తాను డైలాగ్స్ రాసేటపుడు ఈ వన్ లైనర్స్.. పంచ్ డైలాగ్స్ గురించి అసలు ఆలోచించనని.. కొన్నిసార్లు తన అసోసియేట్స్ వాటిని సూచించినా.. వాటిని అంతగా పట్టించుకోనని.. వీటి గురించి బుర్ర బద్దలు కొట్టేసుకోవడం తనకు అంతగా నచ్చదని తేల్చేశాడు సుక్కు. ఎలాంటి పంచ్ డైలాగ్స్ లేకపోయినా.. క్యారెక్టర్లను ఆడియన్స్ కు దగ్గర చేయగలిగితే ఎంతటి విజయం సాధించవచ్చో ప్రత్యక్షంగా రంగస్థలం ద్వారా ప్రూవ్ చేశాడు సుకుమార్. ఓవర్సీస్ లో ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డును కైవసం చేసుకున్న రంగస్థలం.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రికార్డు దిశగా దూసుకుపోతోంది.
Tags:    

Similar News