మళ్ళీ సేమ్ డైరక్టర్ తో సుకుమార్
ఒక ప్రక్కన తన సొంత డైరక్షన్ వెంచర్లు ఎంత లేటవుతున్నా కూడా.. తను రాసిన ఒక కథను ''కుమారి 21 ఎఫ్'' అంటూ ఒక సినిమాగా తీయించాడు సుకుమార్. ఇక నాన్నకు ప్రేమతో రిలీజయ్యాక మనోడు పూర్తిగా రామ్ చరణ్ తో చేయాల్సిన ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తూ.. తదుపరి తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఏ సినిమా తీస్తాడా అనే ఆసక్తిని రేకెత్తించాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది.
ఆ మధ్యన వచ్చిన కొన్ని రూమర్లు ఏం చెప్పాయంటే.. అసలు సుకుమార్ ప్రొడక్షన్ లో డైరక్టర్ గా పనిచేస్తే.. అదిగో కుమారి 21 ఎఫ్ సినిమా టైపులో డైరక్టర్ కు తప్పించి అందరికీ పేరొస్తుందని ఫీలై.. చాలామంది యంగ్ డైరక్టర్లు సుక్కూకి దూరంగా ఉన్నారనే టాక్ వినిపించింది. అయితే ఏం జరిగిందో తెలియదు కాని.. ఇప్పుడు కుమారి 21 ఎఫ్ సినిమా డైరక్టర్ తోనే తన తదుపరి సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. శర్వానంద్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ డైరక్షన్లో సుకుమార్ రైటింగ్స్ కొత్త సినిమా త్వరలోనే మొదలుపెడతారట. ఒక స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతుందని తెలుస్తోంది.
సర్లేండి.. కుమారి 21 ఎఫ్ లో సుకుమార్ స్టయిల్ ఎక్కువగా కనిపించింది అని ఎవరు చెప్పినా కూడా.. అసలు ఒక్కరోజు కూడా షూటింగ్ దగ్గరకే పోలేదని సుక్కూ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు ఆ సినిమా డైరక్టర్ కు మళ్ళా ఛాన్సిచ్చాడంటే మాత్రం పెద్ద విషయమే.