పాన్ ఇండియా హిట్ కోసం తెగ కష్టపడుతున్న స్టార్ పెయిర్..!!
ఈ ఏడాది 'అల వైకుంఠపురంలో' సినిమాతో భారీ హిట్ అందుకున్న తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. స్టైలిష్ సినిమాల డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న పుష్ప మీద ఇప్పటికే అభిమానులలో, సినీ వర్గాలలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయిదు భాషల్లో రిలీజ్ అనేసరికి అప్పటి నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అన్న టాక్ బాగా సాగుతుంది. ఇక సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ అందుకోవాలని చాలా కష్టపడుతున్నారట. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. బన్నీకి జోడీగా రష్మిక మందన చిత్తూరు అమ్మాయిగా అదే వేషబాషాలతో అలరించనుంది.
అయితే సుక్కు - బన్నీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే వారిద్దరూ కలిస్తే ఆ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో మాకు తెలుసు అంటున్నారు ఫ్యాన్స్. సుకుమార్ మీద బన్నీకి ఎంత నమ్మకం ఉందో.. పుష్ప వర్కింగ్ స్టిల్స్ చూస్తే అర్ధమవుతుంది. ఎందుకంటే పుష్ప పూర్తి రియలిస్టిక్ మాస్ మూవీగా రాబోతుంది. అందుకోసం గత నెలలోనే తూగో జిల్లాలో షూటింగ్ స్టార్ట్ చేసింది సుకుమార్ బృందం. అయితే లారీ డ్రైవర్ పాత్రలో బన్నీని సుకుమార్ చాలా కష్టపెడుతున్నాడని టాక్. కానీ అదంతా సినిమా కోసమే కదా.. భరించకపోతే ఎలా అంటూ సర్ది చెప్పుకుంటున్నారట. అడవి ప్రాంతంలో షూటింగ్ కాబట్టి షాట్స్ అన్ని యాంగిల్స్ లో కవర్ చేయడానికి బన్నీని సుక్కు చాలా టేక్స్ అడుగుతున్నాడట. ఇదంతా చూస్తూ సుక్కు టీం సభ్యులే ఆశ్చర్యపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాలలో జరుగుతుందట. నైట్ టైంలో కూడా షూటింగ్ చేస్తున్నారని సుక్కు సన్నిహితులు తెలిపినట్లు సమాచారం.