సీక్రెట్ వెడ్డింగ్ పుకార్లపై సింగర్ క్లారిటీ!

టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా వివాహ వేడుకలకు తాను హాజరయ్యానని అక్కడ దిగిన ఫోటోలను చూసి నెటిజన్లు పొరబడ్డారని అకాసా తెలిపింది.;

Update: 2026-04-27 14:23 GMT

బాలీవుడ్ పాపులర్ సింగర్ అకాసా సింగ్ పెళ్లి పై మీడియాలో ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.అకాసా రహస్యంగా వివాహం చేసుకుంద‌ని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలు వైరల్ కావ డంతో అభిమానులు అభినందనలు తెలపడం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఈ వార్తలను అకాసా ఖండించింది. తాను ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని.. ఇవన్నీ అపోహలు మాత్రమేనని స్పష్టం చేసింది.అసలు ఈ పుకార్లు ఎందుకు వచ్చాయనే విషయాన్ని కూడా అకాసా వివరించింది.

టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా వివాహ వేడుకలకు తాను హాజరయ్యానని అక్కడ దిగిన ఫోటోలను చూసి నెటిజన్లు పొరబడ్డారని అకాసా తెలిపింది.`నా బెస్ట్ ఫ్రెండ్ (మెహ్రీన్) పెళ్లి చేసుకుంటోంది. నేను కాదు` అంటూ అకాసా చమత్కరించింది. తన స్నేహితురాలి సంతోషంలో పాలుపంచుకోవడానికి వెళ్తే? అది తన పెళ్లిగా ప్రచారం కావడం ఆశ్చర్యంగా ఉందంటూ న‌వ్వేసింది. మెహ్రీన్ పిర్జాదా - అకాసా సింగ్ మంచి స్నేహితులు. మెహ్రీన్ పెళ్లి వేడుకల్లో అకాసా సందడి చేసిన దృశ్యాలు నెటిజన్లను తప్పుదోవ ప‌ట్టించిన‌ట్లు తెలుస్తోంది.

పెళ్లి కూతురు పక్కన పద్ధతిగా ముస్తాబైన అకాసాను చూసి ఆమె కూడా ఓ ఇంటిది అయిపోయిందని అందరూ భావించారు. ఈ గందరగోళానికి చెక్ పెట్టేందుకే అకాసా సింగ్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఏవైనా ముఖ్యమైన వార్తలు ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని పేర్కొంది. అకాసా సింగ్ `కాక్‌టైల్ 2`, `నాగిన్` వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. సింగర్‌గానే కాకుండా బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలతో కూడా ఎంతో పాపులర్ అయింది.

ప్రస్తుతం కెరీర్ మీద మాత్రమే దృష్టి సారించానని పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచన లేదని తెలిపింది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో జరిగే ప్రచారం ఒక్కోసారి ఎంతటి గందరగోళానికి దారితీస్తుందో? ఈ ఘటన మ‌రోసారి నిరూపిస్తోంది. అకాసా సింగ్ సమయస్ఫూర్తితో స్పందించి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.నేటి డిజిటల్ యుగంలో సమాచారం ఎంత వేగంగా విస్తరిస్తుందో? అదే స్థాయిలో పుకార్లు కూడా సెకన్ల వ్యవధిలో ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి.

సినీ తారల విషయంలో చిన్నపాటి సందేహం వచ్చినా? దాన్ని పెద్ద వార్తగా మార్చడం సోషల్ మీడియాలో పరిపాటిగా మారింది. అకాసా సింగ్ విషయంలో జరిగినట్లే, పెళ్లి దుస్తుల్లో కనిపిం చడమే ఆలస్యం.. పెళ్లి పై ఎలాంటి ధృవీకరణ లేకుండానే వార్తలు వైరల్ అయ్యాయి. ఇది సెలబ్రిటీల ప్రైవసీని ఒక్కోసారి ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది.

Tags:    

Similar News