కావాల్సినంత టాలెంట్.. మరి పోలిశెట్టి ఎందుకిలా?

ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నెక్స్ట్ సినిమా చేయనున్నారు.;

Update: 2026-04-27 17:30 GMT

టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. తనదైన కామెడీ, టైమింగ్, నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నా.. ఆయన కెరీర్‌ కు సంబంధించి 'ఇంత టాలెంట్, స్టామినా ఉన్నప్పటికీ ఎందుకు సినిమాల మధ్య ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు?' అనే ఒక ప్రశ్న మాత్రం తరచూ వినిపిస్తోంది.

నిజానికి బీటెక్ బ్యాక్‌ గ్రౌండ్ నుంచి వచ్చిన నవీన్, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో ఉద్యోగాన్ని వదిలి ముంబైకి వెళ్లడం కెరీర్‌ లో టర్నింగ్ పాయింట్ అయ్యింది. థియేటర్, స్టాండప్ కామెడీ ద్వారా తన టాలెంట్ పెంచుకుని చిన్న పాత్రలతో సినీ జర్నీ ప్రారంభించారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1: నేనొక్కడినే సినిమాల్లో కనిపించిన ఆయనకు అసలైన బ్రేక్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో వచ్చింది.

ఆ చిత్రంలో హీరోగా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు. తర్వాత బాలీవుడ్‌ లో చిచ్ఛోరే సినిమాలో నటించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జాతి రత్నాలు సినిమా ఆయన కెరీర్‌ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ కామెడీ ఎంటర్టైనర్ భారీ హిట్ సాధించి నవీన్‌ ను స్టార్ హీరోల జాబితాలో నిలబెట్టింది.

అనంతరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. రీసెంట్ గా అనగనగా ఒక రాజు చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌ లో చేరడంతో.. వరుసగా నాలుగు విజయాలతో నవీన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నెక్స్ట్ సినిమా చేయనున్నారు.

అంతా బాగానే ఉన్నా.. నవీన్ కెరీర్‌ లో ఒక విషయం ఏమిటంటే.. సినిమాల మధ్య గ్యాప్. సాధారణంగా మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాలు చేసే ఆయన, ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయగల స్టామినీ ఉన్నప్పటికీ, ప్రతి ప్రాజెక్ట్ మధ్య ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీంతో ఎప్పటికప్పుడు చర్చ జరుగతూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం నవీన్ తీసుకునే కథల ఎంపిక అని తెలుస్తోంది. త్వరగా సినిమాలు పూర్తి చేయడం కంటే, కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తారు.

స్క్రిప్ట్‌ కు ఎక్కువ సమయం కేటాయించడం, ప్రతి సీన్ పై దృష్టి పెట్టడం వల్ల ఆలస్యమవుతుంది. ఆయన చేసే సినిమాలు వినూత్న కథలతో ఉండటంతో ప్రీప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పడుతోంది. హడావుడిగా సినిమాలు చేయడం కంటే క్వాలిటీపై దృష్టి పెడుతున్నారు. మొత్తానికి పోలిశెట్టి కెరీర్‌ లో గ్యాప్ ఉన్నా… ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండాలని చూసే ఆయన స్ట్రాటజీనే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కానీ తక్కువ గ్యాప్ తో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ మాత్రం కోరుకుంటూనే ఉంటారు. మరి పోలిశెట్టి.. ఫ్యూచర్ లో ఏం చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News