పెర్సెంటేజ్ పద్ధతిలో రిలీజ్.. సమ్మర్ టార్గెట్ చేసిన ‘వదలా’ మూవీ!

సాధారణంగా సమ్మర్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఉంటే పెద్ద సినిమాలే వెనకడుగు వేస్తాయి. కానీ తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం తన 'వదలా' సినిమాను మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు.;

Update: 2026-04-27 14:20 GMT

సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మళ్ళీ టాలీవుడ్‌లో స్పీడ్ పెంచారు. ఆయన నిర్మాణంలో జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో వస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘వదలా’ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. తమ్మారెడ్డి సినిమా పైన ఎంతో నమ్మకంగా వున్నాం అని, ఐపీఎల్ ఫీవర్ ఉన్నా సరే, ధైర్యంగా ఈ సమ్మర్‌లోనే సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లతో పని లేకుండా, పాత కాలపు 'పెర్సెంటేజ్' పద్ధతిలో థియేటర్లలో సినిమాను విడుదల చేయబోతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఐపీఎల్ ఉన్నా సరే.. తగ్గేదే లే:

సాధారణంగా సమ్మర్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఉంటే పెద్ద సినిమాలే వెనకడుగు వేస్తాయి. కానీ తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం తన 'వదలా' సినిమాను మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. "అందరూ ఐపీఎల్ ఉంది కదా అని వాయిదా వేసుకుంటున్నారు, కానీ మా సినిమా కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సెన్సార్ బోర్డు నిర్ణయమే ఫైనల్:

సినిమా రిలీజ్ డేట్ గురించి తమ్మారెడ్డి మాట్లాడుతూ.. అంతా సెన్సార్ బోర్డు చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. "చట్టబద్ధంగా సెన్సార్ క్లియర్ అయితేనే రిలీజ్ గురించి గట్టిగా చెప్పగలం. ప్రస్తుతం మే 14వ తేదీని అనుకుంటున్నాము, సెన్సార్ వాళ్ళు ఓకే అంటే అదే రోజు థియేటర్లలోకి వస్తాం" అని వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి అంచనాలు పెంచడంతో, రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

కొత్తగా 'పెర్సెంటేజ్' పద్ధతిలో రిలీజ్:

ఈ సినిమా విషయంలో తమ్మారెడ్డి ఒక విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను అమ్ముతుంటారు, కానీ ఈయన మాత్రం అలా కాకుండా థియేటర్లతో నేరుగా పెర్సెంటేజ్ ప్రాతిపదికన ఒప్పందం చేసుకుంటున్నారు. "గతంలో ఆర్. నారాయణమూర్తి సినిమాలను కూడా మేము ఇదే పద్ధతిలో విడుదల చేసేవాళ్లం. ఇప్పుడు మాకు డిస్ట్రిబ్యూటర్లతో పని లేదు, పర్శంటేజ్ మీదనే మా సినిమా ఆడుతుంది" అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

మిస్టరీ థ్రిల్లర్‌గా ‘వదలా':

ఇక ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. జగపతిబాబు తనదైన విలక్షణ నటనతో మెప్పించబోతుండగా, లయ చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తోంది. టెక్నికల్ స్టాండర్డ్స్ పరంగా ఈ సినిమా చాలా హై క్వాలిటీతో ఉందని, అందుకే థియేటర్లలో ఆడియన్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఒకవైపు ఐపీఎల్ సందడి, మరోవైపు పెద్ద సినిమాల రిలీజ్‌ల మధ్య 'వదలా' సినిమా పెర్సెంటేజ్ పద్ధతిలో ఎలా రాణిస్తుందో చూడాలి. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సీనియర్ నిర్మాత తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం సక్సెస్ అయితే, చిన్న సినిమాలకు ఇదొక కొత్త రూట్ అవుతుంది. మరి సమ్మర్ లో జగ్గూభాయ్, లయ కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మిస్టరీని రివీల్ చేస్తారో వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News