పెళ్లిళ్ల వెబ్ సైట్లలో రంగు పొంగు ఒడ్డు పొడుగు ఎందుకన్న నటవారసురాలు?
రంగు పొంగు చూసి ఏదో ఉందనుకునేవాళ్లంతా హీనులు!! అంటూ తిట్టేసింది కింగ్ ఖాన్ షారూక్ వారసురాలు సుహానా ఖాన్. #ఎండ్ కలరిజం అంటూ తనను ఆ కోణంలో చూసేవారందరికి బుద్ధి చెప్పేందుకు ఉద్యమమే చేపట్టింది ఈ నటనవారసురాలు. పనిలో పనిగా యువతీయువకుల రంగు పొంగు గురించి ఒడ్డు పొడుగు గురించి ప్రత్యేకించి కాలమ్ ఇచ్చే మ్యారేజీ వెబ్ సైట్లనూ తూర్పారబట్టింది సుహానా. ప్రస్తుతం సోషల్ మీడియాల్లో ఇదో హాట్ డిబేట్ గా మారింది. గూగుల్ లోనూ ట్రెండ్ అవుతోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ - నిర్మాత గౌరీ ఖాన్ ల గారాల కుమార్తె సుహానా ఖాన్ భారతీయ సమాజంలో కొన్ని అసమానతల గురించి వెనకబాటు ఆలోచనల గురించి ప్రస్థావించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మీ శరరం గోధుమ రంగులో ఉంది. నల్లగా ఉంది తెల్లగా ఉంది! అనేవాళ్లందరికీ చెంప చెల్లుమనిపించే ట్రీటిస్తోంది స్టార్ కిడ్ సుహానా.
తన శరీర ఛాయను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా దుర్వినియోగపరిచిన వారిపై సుహానా అగ్గిమీద గుగ్గిలమే అయ్యింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ``20 ఏళ్ల సినీ విద్యార్థిని నేను. 12 సంవత్సరాల వయస్సు నుండే `అగ్లీ` అని పిలిచారు. బ్రౌన్ స్కిన్ టోన్ అంటే అమర్యాద దేనికి?`` ప్రస్తుతం చాలా వాటిలో కచ్ఛితంగా పరిష్కరించాల్సిన సమస్యలలో ఇదొకటి !! ఇది నా గురించి మాత్రమే కాదు. ఇది ఎటువంటి కారణం లేకుండా హీనంగా చూసే ప్రతి యువతి లేదా అబ్బాయిల గురించి`` అని సుహానా ఇన్ స్టాలో చెలరేగింది.
తనకు ఎదురైన అవమానకరమైన వ్యాఖ్యల స్క్రీన్ షాట్లను సుహానా మీడియాతో పంచుకున్నారు. ``డీఫాల్ట్ గా గోధుమ రంగులో ఉన్న భారతీయులకు స్కిన్ టోన్ పై తోటి ద్వేషం చూపడం వారి అసురక్షిత స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది`` అని సుహానా అన్నారు.
సోషల్ మీడియా ప్రపంచం ఏర్పాటు చేసిన అందం అనే ఆలోచనను `మ్యాచ్ మేకింగ్ సైట్లు` (పెళ్లిళ్లను ఫిక్స్ చేసేవి) జీవితాల్ని నిర్దేశిస్తాయని సుహానా ఖాన్ అన్నారు. “మీరు 5’7 కాకపోయినా.. మీరు అందంగా లేకపోయినా.. మ్యారేజ్ వెబ్ సైట్లు డీవియేట్ చేస్తాయి. నేను 5’3 అలాగే గోధుమ రంగులో ఉన్నానని తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్లు సహాయపడతాయి. దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా నాలాగే ఉండాలి`` అని తనదైన శైలిలో వ్యంగ్యంగా విరుచుకుపడింది సుహానా. ఎండ్ కలరిజం హ్యాష్‌ట్యాగ్ తో ముగింపును పలికింది సుహానా.