• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైటానిక్ డికా ప్రియోలా...

టైటానిక్ డికా ప్రియోలా మారాడు

By - Tupaki Desk
Update: 2019-05-12 06:06 GMT
ఈ ఫోటోలో యంగ్ హీరోని గుర్తు పట్టగలరా? ఇంతలోనే ఎంత మారిపోయాడు. నిన్న గాక మొన్న చూసిన ఆ కుర్రాడు ఈ కుర్రాడేనా? అన్నంతగా మారిపోయి నిజంగానే అభిమానులకు బిగ్ షాక్ ఇస్తున్నాడు. సినిమా కోసం మారినా అతడిలో అమాంతం వచ్చిన ఈ మార్పు ఊహాతీతమైనది. ఈ మేకోవర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. అసలు సుధీర్ బాబు కెరీర్ ఆరంభంతో పోలిస్తే ఇప్పటి ఈ మార్పు ఎంతో ఇంప్రెస్సివ్ అని పొగిడేయాలి. ప్రతి సినిమాకి అతడిలో ఎంతో మార్పు అయితే కనిపిస్తోంది. నటన పరంగా.. డైలాగ్ డెలివరీ పరంగా పరిణతి అంతే ఇదిగా ఉంటోందని బావ మహేష్ అంతటివాడే కీర్తిస్తున్నాడు.

సినిమావోళ్లు ఏదైనా చేస్తారు లే అని అనుకోకపోతే ఈ మార్పు కోసం సుధీర్ బాబు తొలి నుంచి చేస్తున్న హార్డ్ వర్క్ చూస్తే మతి చెడుతుంది. ఆరంగేట్రమే అతడు ఒక జిమ్నాస్టిక్ గా పరిచయం అయ్యాడు. ఓ లైవ్ వేదికపైనే గగుర్పొడిచే విన్యాసాలతో అలరించాడు. తనలోని ఫ్యాషన్ ని చెప్పకనే చెప్పాడు. అది బాలీవుడ్ లో భాఘి 2లో నటించే అవకాశమే ఇచ్చింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అతడు బాలీవుడ్ లో ఆ ఒక్క చిత్రంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. తెలుగులో హీరోగా నెగ్గాలన్న పంతంతో అటు వెళ్లడం లేదు కానీ బాలీవుడ్ లో అతడికి ఈపాటికే రకరకాల క్యారెక్టర్లతో రెడ్ కార్పెట్ వేసేవారే. కానీ సుధీర్ బాబు టాలీవుడ్ లో నిరూపించుకోవాలన్న కసితో ఉన్నాడు. ఇక్కడ జర్నీ సాఫీగా సాగించేందుకు అవసరమయ్యే అన్ని ఎత్తుగడల్ని వేస్తున్నాడు. బావ మహేష్ నింపిన స్ఫూర్తితో తనని తాను హీరోగా.. సూపర్ హీరోగా మలుచుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. అందుకోసం కఠోరంగానే శ్రమిస్తున్నాడు. ఫిజికల్ అప్పియరెన్స్ .. స్టోరి ఛూజింగ్ లో రాటు దేలుతున్నాడు.

తనకు హిట్లిచ్చిన దర్శకులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సమ్మోహనం డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కలిసి అతడు వీ అనే మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. నిన్నటి రోజున ఇంద్రగంటి అండ్ టీమ్ తో కలిసి సుధీర్ బాబు తన బర్త్ డే వేడుకల్ని జరుపుకున్నాడు. ఈ వేడుకల్లో అతడి మేకోవర్ చూస్తే బిగ్ షాక్ ఇచ్చింది.

లుక్ పరంగా సన్నగా ట్రిమ్ అయ్యాడు.. హెయిర్ కట్ మునుపటి కంటే స్పార్క్ గా ఉంది. ముఖవర్చస్సు కూడా ఇంప్రెస్సివ్ గా ఛేంజ్ అయ్యింది. హాలీవుడ్ స్మార్ట్ బోయ్.. టైటానిక్ డికా ప్రియోలా తలకట్టు మార్చి కాస్త అటూ ఇటూగా కనిపిస్తున్నాడు. ఇంతకీ సుధీర్ బాబు షాకింగ్ మేకోవర్ ఏ సినిమా కోసం? వీ లో కాప్ లుక్ కోసమేనా?  లేక పుల్లెల గోపిచంద్ బయోపిక్ కోసం అనూహ్య మార్పునా? అన్నది తనే చెప్పాలి. బర్త్ డే వేళ సర్ ప్రైజ్ లుక్.. ఇంప్రెస్సివ్. ఇంద్రగంటి టీమ్ తో సెలబ్రేషన్స్ అంతే బావున్నాయిలే..


Tags:    
  • Sudheer Babu 
  • Telugu News 

Similar News

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

Copyright @2026

Powered by Blink CMS