• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు లేడీ డైరెక్టర్.....

తెలుగు లేడీ డైరెక్టర్.. తమిళ స్టార్ హీరోను డైరెక్ట్ చేయనుందా..?

By - Tupaki Desk
Update: 2020-05-05 15:30 GMT
డైరెక్టర్ సుధ కొంగర. పేరు చూడగానే మన రాష్ట్రానికి చెందిందని అర్ధమవుతుంది. ఆ సంగతి నిజమే. కాకపోతే సుధ సినిమాల్లో ఓనమాలు నేర్చుకుంది. ప్రస్తుతం ఓ స్థాయిలో ఉంది. సౌత్ ఇండియాలోనే ఓ పెద్ద సినిమాతో తన పేరు మార్మోగేలా చేసింది. మాధవన్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ఆమె రూపొందించిన ‘ఇరుదు సుట్రు’ అక్కడ సెన్సేషనల్ హిట్టయింది. దీన్ని తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేసి ఇక్కడ కూడా భారీ విజయం అందుకుంది. ప్రస్తుతం సూర్య హీరోగా సుధ రూపొందించిన ‘ఆకాశమే నీ హద్దురా’ విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేదు. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుధకు ఇళయదళపతి విజయ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలిసింది.

సూర్య తర్వాత విజయ్ తోనే సినిమా చేయబోతోందని ఓ ప్రచారం కూడా సాగుతుంది. కానీ ఈ వార్త పై ఇంకా అధికారిక సమాచారం లేదు. కానీ ఈ రోజు సుధ పరోక్షంగా విజయ్‌తో తన సినిమా ఉంటుందన్నట్లు చెప్పకనే చెప్పేసింది. తన కొత్త సినిమా ప్రకటన జూన్ 22న ఉంటుందంటూ ఆమె ఓ ట్వీట్ చేసింది. ఆ రోజు విజయ్ పుట్టిన రోజు. ఆ రోజు ప్రకటన అని చెప్పిందంటే.. విజయ్ తో తన సినిమా గురించి చెప్పబోతుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసే సుధకు.. భారీ కమర్షియల్ సినిమాలు చేసే విజయ్ కి ఎలా సెట్ అవుద్ది అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. ఇదే గనక నిజమైతే.. విజయ్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోయే ఫస్ట్ తెలుగు లేడీ డైరెక్టర్ గా రికార్డు సృష్టిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
Tags:    
  • Kollywood 
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Vijay 
  • Sudha Kongara 
  • Sudha Kongara calrified on the rumours of vijay movie 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS