• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నా తో అల్లు శిరీష్..!

తమన్నా తో అల్లు శిరీష్..!

By - Tupaki Desk
Update: 2021-08-11 10:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 'మాస్టర్ చెఫ్' వంటల ప్రోగ్రామ్ తో బుల్లితెర‌పై సంద‌డి చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కార్యక్రమాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లోకి తీసుకొస్తుండగా.. తెలుగు వెర్షన్ కు తమన్నా హోస్ట్ గా వ్యవహరించనుంది. తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలనేదే ఈ షో ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రోగ్రామ్ త్వరలోనే జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఇప్పటికే దీని ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం మాస్టర్ చెఫ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

'మాస్టర్ చెఫ్' ప్రోగ్రామ్ కు ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ గా యువ హీరో అల్లు శిరీష్ హాజరయ్యారు. ఈ విషయాన్ని శిరీష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. తమన్నా తో కలిసి 'మాస్టర్ చెఫ్' లో భాగం అయినందుకు ఎగ్జైటింగ్ గా ఉందని.. ఇందులో ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ అయినందుకు హ్యాపీగా ఉందని.. తాజాగా షూటింగ్ కూడా పూర్తి చేశామని శిరీష్ తెలియజేసారు. తమన్నా - అల్లు శిరీష్ కలసి వండిన ఈ వంటకాలు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. రాబోయే రోజుల్లో ఈ వంటల కార్యక్రమంలో మరికొందరు సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరు కానున్నారు.

ఇకపోతే తమిళ 'మాస్టర్ చెఫ్' షో కు ‘మక్కల్ సెల్వన్’ విజయ్‌ సేతుపతి.. మలయాళంలో పృథ్వీ రాజ్‌ సుకుమారన్.. కన్నడలో కిచ్చ సుదీప్‌ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. కాగా, తమన్నా ప్రస్తుతం సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా వుంది. ఇప్పటికే 'సీటీ మార్' 'మాస్ట్రో' షూటింగ్స్ పూర్తి చేసిన మిల్కీ బ్యూటీ.. 'గుర్తుందా శీతాకాలం' 'ఎఫ్ 3' సినిమాలలో నటిస్తోంది. మరోవైపు అల్లు శిరీష్ ''ప్రేమకాదంట'' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నారు. మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.
Tags:    
  • Allu Sirish 
  • Tamanna 
  • Master Chef 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!

2026-11-15 20:53 GMT

స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!

2026-11-15 20:53 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

కృష్ణ‌వంశీతో విడాకులు తీసుకున్నారా? ర‌మ్య‌కృష్ణ స్పంద‌న ఇదీ!

2026-11-15 20:28 GMT

ఎన్టీఆర్ ను ఆ క్యారెక్టర్ లో చూపించబోతున్న అనిల్ రావిపూడి...

2026-11-15 20:26 GMT

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...

2026-11-15 20:24 GMT

చిరంజీవి 'కాకా' మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్నారా?

2026-11-15 20:24 GMT

అవకాశం పోతుందనే భయంతో మౌనంగా ఉండిపోయా.. స్వరా భాస్కర్!

2026-11-15 20:07 GMT

టాయ్‌లెట్ వ‌స్తే బిస్ల‌రీ బాటిల్లోనే.. నాటి క‌ష్టాల‌పై సీనియ‌ర్ న‌టి!

2026-11-15 20:03 GMT

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

2026-11-15 20:03 GMT

విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్ డేట్ ఇస్తారా?

2026-11-15 19:27 GMT

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

Copyright @2026

Powered by Blink CMS