చిరు సినిమాలో కనిపించకుండానే స్టార్‌ అయ్యిందే

Update: 2021-05-26 03:30 GMT
బిగ్ బాస్ సీజన్ 4 తో పలువురు కంటెంస్టెంట్స్ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. అంతకు ముందు వరకు తెలియని సోహెల్‌.. మెహబూబ్‌.. అఖిల్ మరియు దివిలు స్టార్‌ సెలబ్రెటీలుగా మారిపోయారు. వీరందరు కూడా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుని కెరీర్‌ లో మాంచి జోరు మీదున్నారు. సోహెల్‌ సినిమా చేస్తే అందులో కీలక పాత్ర చేస్తానంటూ చిరంజీవి ప్రకటించడంతో పాటు దివికి తన వేదాళం రీమేక్ లో ఒక చిన్న పాత్రను ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆమెతో ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లుగా ఫినాలే స్టేజ్‌ పై చిరంజీవి సిగ్గు పడుతూ చెప్పిన విషయం తెల్సిందే.

దివి 'వేదాళం' రీమేక్ తర్వాత ఫుల్ బిజీ అవ్వడం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు. కరోనా ఇతర కారణాల వల్ల వేదాళం సినిమా అదుగో ఇదుగో అంటూ మరింత ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం ఆచార్య సినిమా ను ముగించే పనిలో ఉన్న చిరంజీవి ఆ తర్వాత లూసీఫర్‌ రీమేక్ చేను చేసేందుకు సిద్దం అయ్యాడు. లూసీఫర్‌ సెట్స్ పై ఉండగానే బాబీ దర్శకత్వంలో మూవీ ని కూడా పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. వేదాళం రీమేక్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సమయంలో పాపం దివి అనుకుంటూ ఉండగా వరుసగా ప్రాజెక్ట్‌ లతో దివి పాప సందడి చేసేందుకు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ వారంలో స్పార్క్ ఓటీటీ ద్వారా 'క్యాబ్‌ స్టోరీస్‌' పార్ట్‌ 1 తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో దివి ఫుల్‌ బిజీగా ఉంది. ఇది కాకుండా దివి లంబసింగి అనే సినిమా లో నటించింది. ఆ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఘర్షణ అనే వెబ్‌ సిరీస్ లో దివి కీలక పాత్రలో కనిపించబోతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఘర్షణ కూడా త్వరలో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. మొత్తానికి చిరంజీవి సినిమాలో కనిపించకుండానే దివి పాప ఫుల్‌ బిజీ అయ్యింది. చిరంజీవి సినిమా తర్వాత మరింత స్టార్‌ డంను దక్కించుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News