'ఏలియన్స్' నేపథ్యంలో స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా చిత్రం!
టాలెంటెడ్ యాక్ట్రెస్ తాప్సీ.. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా బిగ్ ప్రాజెక్ట్స్ కలిగి ఉంది. అయితే తాజాగా అమ్మడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తుంది. కే-13 ఫేమ్ భరత్ నీలకంఠన్ దర్శకత్వంలో తాప్సీ ఓ ప్రాజెక్ట్ ఓకే చెప్పింది. పాన్ ఇండియా మూవీగా ఏలియన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ప్రస్తుతం తాప్సీ చేతిలో ఉన్నటువంటి సినిమాలతో చూసుకుంటే ఇది చాలా బిగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సినిమా గ్రహాంతరవాసుల (ఏలియన్స్) గురించి చర్చించనుంది. ప్రస్తుతం సినిమాకు ఏలియన్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
అయితే ఇదివరకు వచ్చినటువంటి హాలీవుడ్ ఏలియన్స్ సినిమాలకు పోలిక లేకుండా భరత్ ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఇది ఏలియన్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అయినప్పటికి హాలీవుడ్ పోలికలు అసలే ఉండవు. ఇండియా లాంటి పెద్ద దేశంలో ఏలియన్స్ ఉండటానికి ఎలాంటి అవకాశం ఉందో అన్వేషణ జరిపే దిశగా సినిమాలో స్టోరీ ఉండబోతుందని సమాచారం. ఈ కథను హీరోయిన్ తాప్సీకి వినిపించగానే బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేసిందట. తాప్సీ ఆల్రెడీ ఏలియన్ మూవీ నిర్మించనున్న నిర్మాతలతో అన్నబెల్లే సుబ్రహ్మణ్యం అనే సినిమా చేస్తోంది. అందులో విజయ్ సేతుపతి సరసన తాప్సీ నటిస్తోంది.
ప్రస్తుతం డైరెక్టర్ భరత్ కాస్టింగ్ పనిలో ఉన్నాడు. ఆ పని అయిపోగానే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. పాన్ ఇండియా రేంజిలో పలు భాషల్లో తెరకెక్కనుంది కాబట్టి ప్రొడక్షన్ వేల్యూస్ అలాగే గ్రాఫికల్ వర్క్ కూడా అదిరిపోయేలా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. విజువల్స్ ఎఫెక్ట్స్ కొరకు ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయని తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. కేవలం విజువల్స్ కోసమే ప్రొడ్యూసర్స్ 10కోట్లు వెచ్చిస్తున్నట్లు టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవలం ఇండియన్ టెక్నీషియన్స్ తో మాత్రమే.. మేడ్ ఇన్ ఇండియా మూవీగా రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాప్సీ త్వరలోనే శభాష్ మిథు సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది. అలాగే జులైలో తాప్సీ నటించిన హసీన్ దిల్రుబా సినిమా ఓటిటి రిలీజ్ కాబోతుంది.