అడివి శేష్ పంచ్ వేసింది ఎవ‌రికి?

ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న లేటెస్ట్ మూవీ 'డెకాయిట్‌'. ఒక ప్రేమ క‌థ అని క్యాప్ష‌న్‌. షానియ‌ల్ డియో ద‌ర్శ‌కుడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌.;

Update: 2026-04-05 13:06 GMT

విభిన్న‌మైన క‌థ‌ల‌ని ఎంచుకుంటూ త‌న‌దైన పంథాలో సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరో అడివి శేష్‌. త‌ను న‌టించే సినిమాల‌కు హీరోగానే కాకుండా రైట‌ర్ గానూ వ‌ర్క్ చేస్తూ స‌క్సెస్‌ల‌లో భాగం అవుతున్న అడివి శేష్ హోట‌ల్ తాజ్ నేప‌థ్యంలో రూపొందిన `మేజ‌ర్‌` మూవీతో పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సైతం త‌న ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న లేటెస్ట్ మూవీ `డెకాయిట్‌`. ఒక ప్రేమ క‌థ అని క్యాప్ష‌న్‌. షానియ‌ల్ డియో ద‌ర్శ‌కుడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌.

బాలీవుడ్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్, ప్ర‌కాష్ రాజ్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఏప్రిల్ 10న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో సుప్రియ యార్ల‌గ‌డ్డ దీన్ని నిర్మించారు. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. ఇందులో అడివి శేష్ చెప్పే డైలాగ్‌లు అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. `దుబాయ్ పోయే ఉందు ఓ ప‌నుండాది.. డ్రైవ‌ర్ నువ్వు..దొంగ నేను..అంద‌కూ మ‌హేష్ బాబులు అయిపోదామ‌నే`.. అంటూ చెప్పే డైలాగ్‌లు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి.

సినిమా రిలీజ్‌కు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో హీరో అడివి శేష్ ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. అంతే కాకుండా ఈ సంద‌ర్భంగా టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరోపై పంచ్‌లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి ట్రెండింగ్ అవుతోంది. నేను త‌న పేరెత్త‌ను..ఓ యాక్ట‌ర్ అంటూ యంగ్ హీరోపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఓ యాక్ట‌ర్ నేను త‌న పేరెత్త‌ను. నా ప్రొడ్యూస‌ర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌ని క‌లిశాను. శేష్ నా కంటే పెద్ద సినిమా చేశావు అన్న‌ట్టుగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. అత‌ను అన్న‌దాన్ని తెలుగులో చెబితే ఆ హీరో ఎవ‌రో మీకు తెలిసిపోతుంది. అందుకే ఇంగ్లీష్‌లో చెబుతున్నాను. ఆ మాట‌లు విని `కుళ్లు బుద్ది నువ్వు` అనుకున్నాను నేను. అంటే ఇంకా మెజ‌రింగ్ కాంటెస్ట్ లైక్ నేనా నువ్వా..నేనా..నాకు వ‌చ్చిన టాక్ ఏంటంటే..యంగ్ హీరోస్ అంద‌రిలో తోపు అయిపోవాల‌నుకుంటే ఆరుగురున్నారు పెద్ద హీరోలు..

వాళ్ల‌క‌న్న తోపు అయిపోవాల‌నుకుంటే ర‌జ‌నీకాంత్ ఉన్నారు..చిరంజీవి గారు ఉన్నారు. వీళ్ల‌క‌న్నా తోపు అవ్వాల‌నుకుంటే కింగ్ ఖాన్ ఉన్నారు. ఆయ‌న క‌న్నా తోపు కావాల‌నుకుంటే టామ్ క్రూజ్ ఉన్నారు. త్వ‌ర‌లో మార్స్‌లో లైఫ్ దొరికితే అక్క‌డ కూడా ఇంకొక‌ళ్లుంటారు. కంపేర్ చేయాల‌ని ఏం ట్రై చేస్తున్న‌న్నావ్‌?` అంటూ యంగ్ హీరో గురించి చెప్పుకొచ్చారు. ఇంత‌కీ అడివి శేష్ చెప్పిన యంగ్ హీరో ఎవ‌రు? అత‌నికి ఎందుకు అంద‌రితో కంపేర్ చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది? అన్న‌ది ఇప్ప‌డు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News