ప్ర‌ముఖ గాయ‌ని కోసం స్టార్ హీరో ప్రీవెడ్డింగ్ పార్టీ

Update: 2020-12-21 04:34 GMT
సింగర్ సునీత .. ప్ర‌ముఖ మీడియా హౌస్ అధినేత‌ రామ్ వీరపనేనిని పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో వివాహానికి ప్రిప‌రేష‌న్స్ లో ఉన్నారు ఈ క‌పుల్. ఈ జంట కొద్ది రోజుల క్రితం ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకల నుండి కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. త్వరలో ఒక‌ట‌వుతున్న ఈ జంట కోసం ప్రీ-వెడ్డింగ్ వేడుక‌‌ను ఏర్పాటు చేసినది స్టార్ హీరో నితిన్ అని ఓ పుకారు ఉంది. రామ్ కు నితిన్ చాలా క్లోజ్‌. గచ్చిబౌలిలోని ఒక స్టార్ హోటల్ లో నితిన్ స్వ‌యంగా పార్టీని ఏర్పాటు చేశార‌న్న గుస‌గుస వినిపిస్తోంది.

రేణు దేశాయ్.. సుమ కనకల తదితరులు ఈ పార్టీకి హాజరై దంపతులను అభినందించారు. ఈ వేడుక‌కు సింగ‌ర్ సునీత.. రామ్ ల‌కు అత్యంత‌ స‌న్నిహితులు ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు విచ్చేశార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News