వినయం నటించకు మ్యాన్! వెంకీకి ధనుష్ షాకింగ్ కౌంటర్
తమిళ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటించిన తాజా సినిమా కర రిలీజ్ కు రెడీ అవుతుండగా, సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.;
తమిళ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటించిన తాజా సినిమా కర రిలీజ్ కు రెడీ అవుతుండగా, సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 30న తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా జరిగిన సరదా సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకీ అట్లూరి, ధనుష్ తో తనకున్న అనుబంధాన్ని ఆసక్తికరంగా గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సార్ సినిమా టైమ్ లో జరిగిన ఓ సంఘటనను ఆయన పంచుకున్నారు. షూటింగ్‌కు ముందే జరిగిన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఒక ట్యూన్ విన్న వెంటనే లిరిక్స్ తానే రాస్తానని ధనుష్ చెప్పడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వెంకీ తెలిపారు. ఆ తర్వాతి రోజు రాత్రి షూటింగ్ మధ్యలోనే పిలిచి, కేవలం ఐదు నిమిషాల్లో పల్లవి, కొద్ది సేపట్లోనే చరణం పూర్తి చేయడం తనకు మరింత ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు.
దీనిపై స్పందించిన ధనుష్, ఆ టాలెంట్ తనకు దేవుడిచ్చిన వరమని వినయంగా చెప్పారు. దానికి వెంకీ రియాక్ట్ అవుతూ ధనుష్ మీద దేవుడి ఆశీర్వాదం ఉంది. ఆయన టాలెంట్‌లో 10 శాతం వచ్చినా మేము చాలా దూరం వెళ్తాం అని కొనియాడారు. అయితే వెంటనే ధనుష్ సరదాగా స్పందిస్తూ, నువ్వు వినయంగా నటించకు మ్యాన్, అది నీకు సూట్ కాదు. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్లు ఇస్తూ మీరు టాలెంటెడ్ సార్ అని యాక్ట్ చేస్తున్నావ్. యాక్టింగ్ నేను చూసుకుంటా.. నువ్వు డైరెక్షన్ చూసుకో అంటూ నవ్వులు పూయించారు. దీనికి వెంకీ అట్లూరి కూడా అదే సరదా టోన్‌లో, నాకు యాక్టింగ్ రాకనే డైరెక్షన్ చేస్తున్నాను సార్ అని సమాధానం ఇచ్చారు. ధనుష్ వర్కింగ్ స్టైల్‌పై కూడా వెంకీ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. తక్కువ కాలంలోనే సినిమాలను పూర్తి చేసి, బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.
అయితే ఈ సందర్భంగా ధనుష్ తన సక్సెస్ పై చాలా సమతుల్య దృక్పథాన్ని వ్యక్తం చేశారు. ఒక సినిమా సక్సెస్ ఒక్కరి కృషి వల్లే సాధ్యం కాదని, అది మొత్తం టీమ్ కృషి ఫలితమని స్పష్టం చేశారు. డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయినప్పటికీ, టెక్నికల్ టీమ్, నటీనటుల సహకారం లేకుండా విజయం సాధ్యం కాదని చెప్పారు. ఒక సినిమా తన ఫలితాన్ని తానే నిర్ణయించుకుంటుందని ప్రముఖ డైరెక్టర్ బాలు మహేంద్ర చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించింది.