ఆ డైరెక్టర్ కి డబ్బుల పోరు పెరిగిందట

Update: 2016-10-20 22:30 GMT
టాలీవుడ్ లో ఆయన ఓ పెద్ద డైరెక్టర్. స్టార్ స్టేటస్ ఉన్న అతి తక్కువ మంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. సహజంగా ఇంత పెద్ద డైరెక్టర్ అంటే డబ్బుల కోసం పెద్దగా సమస్యలేమీ ఉండవు. ఈయన కూడా మరీ ఇబ్బందులేమీ పడిపోవడం లేదు కానీ.. కాసింత ప్రొఫెషనల్ సమస్యలు వస్తున్నాయట. ఈ మధ్య ఇంటి నుంచి కూడా ఈ విషయంలో కాస్త పోరు పెరిగిందని అంటున్నారు.

సాధారణంగా పెద్ద దర్శకులు చకచకా సినిమాలు తీసేస్తుంటారు కానీ.. ఈయన మాత్రం రెండేళ్లకో సినిమా చొప్పునే తీస్తూ ఉంటాడు. కాకపోతే.. అన్నీ స్టార్ హీరోలతోనే ఉంటాయి. ప్రస్తుతం ఈయన సమకాలికులు అందరూ 50.. 100 కోట్లు చొప్పున వెనకేసుకుంటే.. ఈయన ఇంకా మామూలు రేంజ్ లో ఉండిపోవడంతో.. సినిమాల స్పీడ్ పెంచమని.. ఏడాదికి రెండు చొప్పున తీయాలని ఇంటి దగ్గర నుంచి సలహాలు వస్తున్నాయట.

తనతో సినిమాలు తీసే నిర్మాతలకు కూడా రెమ్యూనరేషన్ పెంచాలంటూ ఇన్ డైరెక్టుగా చెబుతున్నాడని అంటున్నారు. సక్సెస్ రేషియో ఎక్కువే ఉన్న ఈ దర్శకుడికి కాస్త ఎక్కువ మొత్తం ముట్టచెప్పడం పెద్ద విషయం కాదు కానీ.. సినిమాల విషయంలో స్పీడ్ పెంచితే.. ఫ్యాన్స్ కూడా సంతోషిస్తారు కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News