• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉస్తాద్ సెట్ లో...

ఉస్తాద్ సెట్ లో ప్రత్యక్షమైన స్టార్ డైరెక్టర్ శంకర్..!

By - Tupaki Desk
Update: 2021-07-15 02:30 GMT
స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు - శిరీష్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది. '#RC15' చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్న శంకర్.. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో '#RAPO19' సెట్స్ కు వెళ్లి చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేశారు శంకర్.

ఎనర్జిటిక్ హీరో 'ఉస్తాద్' రామ్ పోతినేని - లింగుస్వామి కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో వస్తున్న ఈ బైలింగ్విల్ లో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. సీనియర్ నటి నదియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు లింగుస్వామి తో సన్నిహితంగా ఉండే శంకర్.. '#RAPO19' సెట్స్ ను సందర్శించి చిత్ర బృందానికి విషెస్ అందించారు. ఈ సందర్భంగా చిత్రంలోని ఓ మెలోడీ పాటను విన్న శంకర్.. చాలా బాగుందని చెప్పారని తెలుస్తోంది. అలానే కొద్దిసేపు అక్కడే గడిపి.. గత రెండు రోజులుగా షూట్ చేసిన రషెస్ చూశారు.

'#RAPO19' సెట్స్ లో శంకర్ ఉన్న ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలలో దర్శకుడు శంకర్ కు హీరో రామ్ ఫ్లవర్ బొకే ఇస్తూ కనిపిస్తున్నారు. ఇందులో హీరోయిన్ కృతి శెట్టి - దర్శకుడు లింగుస్వామి - నదియా లతో పాటుగా చిత్ర నిర్మాతలు ఉన్నారు. కాగా, రామ్ -లింగుస్వామి చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
Tags:    
  • Ram Pothineni 
  • Shankar 
  • Nadhiya 
  • Linguswamy 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS