మెగాస్టార్ మూవీకి మ్యూజిక్ వర్క్ ప్రారంభించిన తమన్..!

Update: 2021-06-28 14:30 GMT
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత మూవీస్ పరంగా స్పీడ్ పెంచినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 152వ చిత్రం ఆచార్య షూటింగ్ ముగింపు దశలో ఉండగానే 153వ చిత్రం పనులు ప్రారంభం అయిపోయాయి. మెగాస్టార్ తదుపరి సినిమా డైరెక్టర్ మోహన్ రాజాతో చేయనున్న సంగతి తెలిసిందే. మలయాళం సూపర్ హిట్ చిత్రం 'లూసిఫర్' రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు ఏకంగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కానిచ్చేస్తున్నాడు దర్శకుడు మోహన్ రాజా. తాజాగా అందుకు సంబంధించి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నటువంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఫస్ట్ టైమ్ మెగాస్టార్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీంతో సినిమా మ్యూజిక్ పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా లూసిఫర్ మ్యూజిక్ సిట్టింగ్స్ తమన్.. డైరెక్టర్ మోహన్ రాజా ప్రారంభించినట్లు అర్ధమవుతుంది. ఇద్దరు కూడా మాస్ మ్యూజిక్ గురించి బాగా చర్చించినట్లు సమాచారం. డైరెక్టర్ మోహన్ ఆల్రెడీ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసాడు. మెగాస్టార్ సినిమాలో ఉండాల్సిన మాస్ అంశాలన్నీ పుష్కలంగా జోడించి స్క్రిప్ట్ రాసినట్లు తెలుస్తుంది. అయితే సినిమాలో హీరోయిన్ ఉంటుందా ఉండదా అనేది తెలియాల్సి ఉంది.

ఎందుకంటే ఒరిజినల్ లో హీరోయిన్ ఉండదు. మరిక్కడ మెగాఫ్యాన్స్ ఏమో డిమాండ్ చేస్తుంటారు. మరి ఎలా సిద్ధం చేసారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. అయితే లూసిఫర్ సినిమాతో అటు డైరెక్టర్ మోహన్ రాజాకు.. ఇటు తమన్ కు మెగాస్టార్ తో సినిమా అనే డ్రీమ్ నిజమైందనే చెప్పాలి. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ - కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఆర్బీ చౌదరి - ఎన్వి ప్రసాద్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో మాత్రం పట్టాలెక్కేలా లేదు. ఎందుకంటే సినిమా వచ్చే ప్రారంభం కావచ్చని మేకర్స్ చెబుతున్నారు. అప్పటివరకు ఆచార్య కూడా పూర్తై రిలీజ్ అవుతుంది. మెగాస్టార్ లూసిఫర్ సినిమా టైటిల్ కూడా మార్చుతారని టాక్. చూడాలి మరి ఏ టైటిల్ తెరమీదకు రాబోతుందో..!!
Tags:    

Similar News