అసలు అప్డేట్లకంటే ఈ కొసరేంటి థమన్ భయ్యా

Update: 2018-08-30 12:11 GMT
టాలీవుడ్ లో ఉన్న బిజీ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ పేరును మనం తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలి.  అప్పుడప్పుడు థమన్ ట్యూన్లు రొటీన్ అయ్యాయని - మరోటని కొంతమంది పనిలేని విమర్శలు చేస్తుంటారుగానీ అటూ ఇటు తిరిగి మళ్ళీ ఫిలింమేకర్స్ మాత్రం థమన్ దగ్గరికే వస్తారు.  థమన్ ప్రస్తుతం చాలా సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు కానీ అందులో స్పెషల్ మాత్రం 'అరవింద సమేత వీర రాఘవ'.

త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా కావడంతో థమన్ మాటిమాటికీ ఎగ్జైట్ అవుతున్నాడు.  యంగ్ టైగర్ సినిమాలకు గతంలో పని చేశాడు కాబట్టి ఈ ఎగ్జైట్ మెంట్ కు కారణం గురూజీ కావొచ్చు.  మామూలుగానే థమన్ సోషల్ మీడియాలో యాక్టివ్.  దాంతోపాటు ఎగ్జైట్ మెంట్ కూడా తోడవడంతో మ్యూజిక్ సిట్టింగ్స్ దగ్గరనుండి మొదలు పెడితే విడతలవారీగా ఎదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. రెండు రోజుల క్రితం అర్థం కాని మ్యూజిక్ బాష పేజీల ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి '"అరవింద సమేత కు బ్యాక్ గ్రౌండ్ స్కోరు రాయడం మొదలు పెట్టాను.  ఆడియో అప్డేట్స్ కమింగ్ సూన్" అని  ట్వీటెట్టాడు.   

అంతా ఓకె గానీ అసలు అప్డేట్స్ లేకుండా ఈ కొసరేంటని నెటిజనులు కాస్త చిరాకు పడుతున్నారు.  ఇక్కడ జనాలకు తెలిసిన తెలుగు భాషే సరిగా అర్థం కాదు.. ఇక ఆ తెలియని సంగీత భాష ఎలా అర్థం అవుతుంది?  సింగిల్ రిలీజ్ డేట్ చెప్పకుండా ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పేజీల ఫోటోలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  అర్థం చేసుకో థమన్ భయ్యా!
Tags:    

Similar News