జక్కన్నకు కరోనా : వర్మ ఫన్నీ సలహా బండ్ల కూడా

Update: 2020-07-30 06:00 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి మరియు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. అమితాబచ్చన్‌ ఫ్యామిలీ కరోనా పాజిటివ్‌ అంటూ తెలిసిన సమయంలో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు జక్కన్న విషయంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో పలువురు పలు రకాలుగా జక్కన్న అండ్‌ ఫ్యామిలీకి సలహాలు ఇస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ అందరు కూడా ఆశిస్తు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెడుతున్నారు.

ఎలాంటి విషయాన్ని అయినా చాలా లైట్‌ గా తీసుకునే రామ్‌ గోపాల్‌ వర్మ ఈ విషయంలో కూడా ఫన్నీగా స్పందించాడు. సర్‌ మీ బాహుబలిని పిలవండి. అతడితో కరోనాను ఒక్క తన్ను తన్నించండి. అప్పుడు కరోనా పారిపోతుంది. త్వరలోనే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా కోలుకుంటారని ఆశిస్తున్నాను అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. వర్మ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇక బండ్ల గణేష్‌ కూడా రాజమౌళి కరోనా విషయమై స్పందించాడు.

కొన్ని వారాల క్రితం బండ్ల గణేష్‌ కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. రెండు వారాల చికిత్స తర్వాత బండ్ల గణేష్‌ కరోనా నెగటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. ఆ అనుభవంతో రాజమౌళి కుటుంబంకు బండ్ల గణేష్‌ కొన్ని సలహాలు ఇచ్చాడు. సోషల్‌ మీడియాలో రాజమౌళిని ట్యాగ్‌ చేసి.. కంగారు లేకుండా హ్యాపీగా ఉండండి. ప్రతి రోజు కోడి గుడ్లు తింటూ ఎక్కువ నిద్ర పోండి ఏం కాదు. భయపడాల్సిన పనే లేదని బండ్ల గణేష్‌ ధైర్యం చెప్పాడు. ఇంకా ఎంతో మంది కూడా జక్కన్న అండ్‌ ఫ్యామిలీకి సలహాలు సూచనలు ఇస్తున్నారు.
Tags:    

Similar News