శ్రీరస్తు అక్కడ మళ్లీ ఫెయిలయ్యాడు

Update: 2016-08-30 04:25 GMT
అల్లు శిరీష్-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం తెలుగు రాష్ట్రాల వరకూ పెద్ద సక్సెస్ సాధించింది. నాలుగోవారంలో కూడా మంచి షేర్ సాధిస్తూ.. రెంటల్ పై కాకుండా షేర్ పద్ధతిలో థియేటర్లలో రన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఓవర్సీల్ లో మాత్రం ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.

ఆగస్ట్ 5న మొదట రిలీజ్ అయినపుడు.. యూఎస్ జనాలు అంతగా రిసీవ్ చేసుకోలేదు. కానీ ఇక్కడ సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత.. ఓవర్సీస్ లో మరోసారి భారీగానే రిలీజ్ చేశారు. కానీ ఈ సారి కూడా ఆడియన్స్ నుంచి అంతగా స్పందన లేదు. ప్రేక్షకుల కోరిక మేరకే సెకండ్ రిలీజ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు కానీ.. అలాంటిదేమీ బాక్సాఫీస్ దగ్గర కనిపించలేదు. సింపుల్ గా చెప్పాలంటే.. సెకండ్ రిలీజ్ లో కూడా యూఎస్ వరకూ శ్రీరస్తు ఫెయిల్  అయినట్లే.

దీని ముందు వారం వచ్చిన పెళ్లి చూపులు చిత్రానికి గత వీకెండ్ లో 30వేల డాలర్ల కలెక్షన్స్ రాగా.. తిరిగి భారీగా రిలీజ్ అయిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం ఈ మార్క్ కూడా అందుకోలేకపోయింది. ఫ్యామిలీ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ ఉండే యూఎస్ లో.. శ్రీరస్తుకు ఆదరణ దక్కకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Tags:    

Similar News