• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆగ‌డు' ఎఫెక్ట్...

'ఆగ‌డు' ఎఫెక్ట్ లేదనేశాడు!

By - Tupaki Desk
Update: 2018-11-13 11:51 GMT
`పోకిరి` త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ `సైనికుడు` - `అతిధి` - `ఖ‌లేజా` రూపంలో వ‌చ్చిన ప్లాప్‌ ల‌కు ఊపిరాడ‌ని స‌న్నివేశం ఎదురైంది. అప్పుడే మ‌హేష్ కు ఎదుర‌య్యాడు శ్రీనువైట్ల‌. అప్ప‌టికే వైట్ల స‌క్సెస్ ల‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆ టైమ్‌ లో మ‌హేష్‌ కు  వైట్ల వినిపించిన‌ `దూకుడు` క‌థ‌కు ఒకే చెప్ప‌డం - రొటీన్ గా వెళ్లిపోతున్న సూప‌ర్ స్టార్ ను  కొత్త యాంగిల్ లో చూపించి ఊహించ‌ని స‌క్సెస్ ఇచ్చాడు. శ్రీనువైట్ల శైలి కి - తెలంగాణ యాసను జోడించడంతో  సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఆ హిట్ మహేష్ కు ఊర‌ట‌నివ్వ‌డ‌మే కాకుండా న‌టుడిగా  మ‌రో మెట్టు పైకి ఎక్కించింది.

ఆ త‌ర్వాత మ‌హేష్ న‌టించిన‌ `బిజినెస్ మెన్`  - `సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చట్లు` సినిమాలు యావ‌రేజ్‌ గా ఆడ‌గా - `వ‌న్ నేనొక్క‌డినే` తో మ‌రో డిజాస్ట‌ర్ ఖాతాలో వేసుకోవాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో  `దూకుడు`మీదున్న కాన్ఫిడెన్స్ తో సూప‌ర్ స్టార్ - శ్రీనువైట్ల‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. అదే `ఆగ‌డు`. ఆ సినిమా ఇద్ద‌ర్నీ కోలుకోని దెబ్బ‌కొట్టింది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు అందుకుందో తెలిసిందే. ఆ త‌ర్వాత మహేష్  వెంట‌నే ప్లాప్ నుంచి బ‌య‌ట‌ప‌డినా - శ్రీనువైట్ల మాత్రం ప‌ట్టాలు  త‌ప్పాడు. త‌ర్వాత చేసిన సినిమాల‌న్నీ డిజాస్టర్ల గానే మిగిలాయి. చివ‌రికి స్నేహితుడు ర‌వితేజ క‌రుణించి `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` తో ఛాన్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా మ‌హేష్ తో - శ్రీ‌నూకి ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ... `ఆగ‌డు` ప్లాప్ త‌ర్వాత మ‌హేష్ తో మీ రిలేష‌న్ ఎలా ఉంద‌ని ఓ క్వ‌శ్చ‌న్ రెయిజ్ చేసింది మీడియా. దీనికి శ్రీ‌నూ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు. `మ‌హేష్ నాకు మంచి స్నేహితుడు.  ఇద్ద‌రి మ‌ధ్య స‌త్స‌సంబంధాలున్నాయి. నాకు ప్లాప్ లు ఉన్నాయ‌ని - నేను ఆయ‌న‌కి స‌క్సెస్ ఇచ్చాన‌ని - నాతో మ‌రో సినిమా చేయండ‌ని ఎప్పుడూ అడగ‌లేదు. అప్ప‌ట్లో ఇద్ద‌రం కలిసి ప‌నిచేయాల‌నుకున్నాం. చేసామంతే. అలాగే ఏ నిర్మాత‌ను నాతో సినిమా చేయండ‌ని ఇప్ప‌టివ‌ర‌కూ అడ‌గ‌లేదు. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` నిర్మించ‌డానికి ఐదుగురు నిర్మాత‌లు పోటీప‌డ్డారు. కానీ నా ఛాయిస్ మైత్రీ మేక‌ర్స్ అయింది. అందుకే వాళ్ల‌తో సినిమా చేసా. సినిమా బాగా వ‌చ్చింది. సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాం` అని తెలిపాడు.

Tags:    
  • Srinu Vaitla 
  • Mahesh Babu 
  • Aagadu Movie 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS