• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాకు కొడుకు బన్నీని...

నాకు కొడుకు బన్నీని చూస్తే చాలు-శ్రీకాంత్

By - Tupaki Desk
Update: 2016-04-11 11:30 GMT
తమకు ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా సరే.. మెగా హీరోలు తమ ప్రతి సినిమాకూ చాలా కష్టపడతారని.. ఆ కష్టమే వాళ్లను పెద్ద స్థాయికి తీసుకెళ్తోందని అన్నాడు సీనియర్ హీరో శ్రీకాంత్. ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్ కు బాబాయిగా నటించిన శ్రీకాంత్.. ఈ సినిమా కోసం బన్నీ పడ్డ కష్టాన్ని తన కళ్లారా చూశానని అన్నాడు. పనిలో పనిగా బన్నీతో పాటు రామ్ చరణ్ ను కూడా కలుపుకుని తెగ పొగిడేశాడు శ్రీకాంత్.

‘‘ఇంతకుముందు రామ్ చరణ్ తో చేశాను. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేశాను. తమకు మెగా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే.. వీళ్లు ఎక్కడా భేషజం చూపించలేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నేను కూడా వీళ్లలాగా సినిమా కోసం ఇంత కష్టపడలేదేమో అనిపిస్తుంది. వీళ్ల కష్టం చూస్తే సీనియర్లుగా మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సెట్లో బన్నీ డెడికేషన్ చూస్తే ముచ్చటేస్తుంది. ఓ మెడిటేషన్ లాగా నటనను భావిస్తాడు. అంత ఫోకస్డ్ గా ఉంటాడు. బన్నీ.. రామ్ చరణ్ మాత్రమే కాదు.. ఎన్టీఆర్.. మహేష్ బాబు లాంటి వాళ్లు కూడా చాలా కష్టపడతారు. వీళ్లందరూ రేపటి తరానికి స్ఫూర్తి.

రేప్పొద్దున నా కొడుకే వస్తాడు.. అతడికి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లు లాంటివేమీ అవసరం లేదని చెబుతాను. ఒకసారి సెట్లోకి వచ్చి బన్నీ యాక్టింగ్ చూడు చాలు నీకే తెలుస్తుంది అంటాను. డైలాగ్ అయినా సరే.. డ్యాన్స్ మూమెంట్ అయినా సరే అంత బాగా చేస్తాడు బన్నీ. అన్నయ్య చిరంజీవితో చేస్తున్నపుడు నాకు చాలా భయంగా ఉండేది. ఆయనతో డ్యాన్స్ మూమెంట్ అనగానే వణుకొచ్చేసేది. బన్నీ విషయంలోనూ అదే జరిగింది. తనతో నాకో మూమెంట్ పెట్టారు. దాని గురించి చెబితే నాకిది అవసరమా అన్నాను. కానీ బన్నీ పట్టుబట్టి చేయించాడు. ఇంతకుముందు రుద్రమదేవిలో అతణ్ని చూసి షాకయ్యాను. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఇప్పుడు ‘సరైనోడు’లో కూడా బన్నీ ఇందులో ఓ కొత్త బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తాడు’’ అని శ్రీకాంత్ అన్నాడు.
Tags:    
  • Srikanth 
  • Allu Arjun 
  • Sarrainodu 
  • Telugu NEWs 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS