మదర్ మెరుపులు.. డాటర్ సొగసులు..

Update: 2017-02-15 10:18 GMT
అందాల తార శ్రీదేవి.. ఇప్పటికీ తన మేని మెరుపులతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. గతంలో కాసింత మీడియాకి దూరం పాటించేది కానీ.. ఇంగ్లీష్ వింగ్లిష్ అంటూ రీ ఎంట్రీ తర్వాత స్టైల్ మార్చింది. మధ్యమధ్యలో హాట్ పోజులు కూడా ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

ఈ మధ్య కాలంలో కూతురు జాహ్నవి కపూర్ తో కలిసి మరీ కెమేరాలకు తెగ కనిపించేస్తోంది అందాల తార. పైగా అమ్మాకూతుళ్లు మ్యాచింగ్ డ్రస్సులతో మెరిసిపోతూ ఉంటారు. ఒకే రకమైన థీమ్ తో డ్రెసింగ్ చేసి అలరించడం వీరికి బాగా అలవాటు అయిపోయింది. కేజువల్స్ లో కనిపించినా.. డిజైనర్ వేర్ అయినా ఈ స్టైల్ మారలేదు. తాజాగా వైట్ థీమ్ తో దేవతలా మెరిసిపోతూ శ్రీదేవి దర్శనం ఇస్తే.. అందుకు తగ్గట్లుగా యువరాణి రేంజ్ లో దర్శనం ఇచ్చింది జాన్వి. అందాలను చూపించడంలో.. తన అనుభవం అంతా రంగరించి మరీ కూతురు విషయంలో అప్లై చేసేస్తోంది శ్రీదేవి.

గతంలో మాదిరిగా జాన్వి తన ఇష్టం వచ్చినట్లుగానో.. బాయ్ ఫ్రెండ్స్ తోనో.. సగం సగం డ్రస్సులలోనో ఈ మధ్య పోస్టులు పెట్టడం లేదు. ఇందుకు కారణం అమ్మ ట్రైనింగే అనే టాక్ అనే విషయం తెలుస్తూనే ఉంది. ఇక జాన్వి అరంగేట్రం అదిరిపోయే రేంజ్ లో ఉండేందుకు శ్రీదేవి చాలానే స్కెచ్ లు వేస్తోంది. తొలి సినిమాతోనే తన కూతురు జాన్విని టాప్ హీరోయిన్ రేస్ లో ఉంచాలన్నది శ్రీదేవి కోరిక.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News