• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీదేవి.. కాజల్.....

శ్రీదేవి.. కాజల్.. తమన్నా.. రకుల్‌.. లావణ్యలు చాలా స్పెషల్ గురూ

By - Tupaki Desk
Update: 2021-05-25 06:30 GMT
సినిమా ఇండస్ట్రీలో హీరోల లైఫ్‌ స్పాన్ తో పోల్చితే హీరోల లైఫ్‌ స్పాన్‌ తక్కువ ఉంటుంది. కొందరు హీరోయిన్స్ స్టార్‌ డంను దక్కించుకున్నా నాలుగు అయిదు సంవత్సరాల్లోనే కనుమరుగవుతూ ఉంటారు. కొందరు మాత్రం పుష్పర కాలం అయినా కొనసాగుతూ ఉంటారు. కాని హీరోల మాదిరిగా రెండు మూడు దశాబ్దాల సినీ కెరీర్ ను హీరోయిన్ లు కంటిన్యూ చేయలేరు. కొందరు హీరోయిన్స్‌ మాత్రమే ఇండస్ట్రీలో రెండు తరాల హీరోలతో నటించిన అరుదైన రికార్డును దక్కించుకున్నారు. అందులో కూడా అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే తండ్రి కొడుకులకు జోడీగా హీరోయిన్‌ గా నటించారు. పైన పేర్కొన్న పేర్లు ఆ స్పెషల్‌ హీరోయిన్స్‌ వే.

అప్పటి వరకు ఏ హీరోయిన్‌ దక్కించుకోని రికార్డును శ్రీదేవి దక్కించుకుంది. ఏయన్నార్ తో చాలా సినిమాల్లో నటించిన శ్రీదేవి ఆయన తనయుడు నాగార్జునతో కూడా నటించింది. ఒకే హీరోయిన్‌ తండ్రితో కొడుకుతో నటించింది అంటూ అప్పుడు జనాలు ముక్కున వేలేసుకున్నారు. శ్రీదేవి తర్వాత చాలా కాలం వరకు ఆ ఘనత దక్కించుకోలేక పోయారు. చాలా కాలం తర్వాత కాజల్.. తమన్నా.. రకుల్‌.. లావణ్య త్రిపాఠిలు తండ్రి కొడుకులతో హీరోయిన్ గా నటించిన ఘనత దక్కించుకున్నారు.

కాజల్‌ మొదట కొడుకు చరణ్ తో నటించి ఆ తర్వాత తండ్రితో నటించింది. చరణ్‌ తో మగధీర.. నాయక్‌.. గోవిందుడు అందరివాడేలే సినిమా లను చేసిన కాజల్‌ ఆ తర్వాత చిరంజీవితో ఖైదీ నెం.150 నటించింది. ప్రస్తుతం ఆచార్య సినిమాలో కూడా ప్రస్తుతం చిరంజీవితో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక తమన్నా కూడా కూడా చరణ్‌ తో నటించి చిరంజీవితో నటించింది. నాగచైతన్యతో నటించిన తమన్నా నాగార్జున సినిమాలో కూడా నటించింది. కాని ఆ సినిమాలో నాగ్ కు జోడీగా నటించలేదు. ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్ నాగచైతన్యతో నటించి ఆ తర్వాత నాగార్జునతో మన్మధుడు 2 సినిమాలో నటించిన విషయం తెల్సిందే. నాగచైతన్యతో నటించిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత నాగార్జునతో కూడా నటించిన విషయం తెల్సిందే. అందుకే ఈ అయిదుగురు హీరోయిన్స్ చాలా స్పెషల్‌.
Tags:    
  • Sridevi 
  • Kajal 
  • Tamanna 
  • Rakul 
  • tollywood movies 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS