అతను-నారా రోహిత్.. ఢీ అంటే ఢీ

Update: 2016-12-24 05:30 GMT
చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వస్తున్న యువ నటుడు శ్రీ విష్ణు ఇప్పుడు ఓ ఆసక్తికర సినిమాలో హీరోగా పలకరించబోతున్నాడు. నారా రోహిత్ లాంటి ఎస్టాబ్లిష్డ్ హీరోకు దీటుగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలో కీలక పాత్ర చేశాడు శ్రీవిష్ణు. ఇందులో అతడిది క్రికెటర్ టర్న్డ్ క్రిమినల్ క్యారెక్టర్. కథ ప్రధానంగా అతడి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ట్రైలర్లో నారా రోహిత్ కంటే కూడా శ్రీవిష్ణునే హైలైట్ అవడం విశేషమే. తెరమీద ఇద్దరిలో ఎవరు ఎవర్ని డామినేట్ చేస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్ కు కీలక మలుపు అని.. ఈ సినిమాలో రోహిత్.. తాను పోటాపోటీగా నటించామని.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని శ్రీవిష్ణు చెప్పాడు.

‘‘అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో నాది రైల్వే రాజు పాత్ర. అతడికి క్రికెట్ అంటే పిచ్చి. మంచి ఆటగాడు కూడా. ఎంతో కష్టపడి రెండేళ్లలో భారత జట్టులో చోటు సంపాదిస్తాడు. కానీ అనుకోకుండా అతడికి ఎదురైన ఓ సమస్య అతడి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అదేంటన్నది తెరమీదే చూడాలి. 1990 కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఆ ఘటనల్లో కొన్ని రాష్టాన్నే కాదు దేశాన్ని కూడా ఊపేశాయి. అటువంటి ఓ ఐదు అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఓ పోలీస్‌ అధికారికి.. ఓ క్రికెటర్ కు మధ్య కథ నడుస్తుంది. తాను చేసిందే కరెక్ట్‌ అనుకుని రూల్స్‌ బ్రేక్‌ చేసే పోలీస్ ఆఫీసర్‌ ఇంతియాజ్‌ అలీగా రోహిత్ కనిపిస్తాడు. నా పాత్ర కూడా ఆయనకు దీటుగా ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకు సవాల్. నా కెరీర్‌ కి పెద్ద ప్లస్‌ అయ్యే క్యారెక్టర్‌ ఇది’’ అని శ్రీవిష్ణు అన్నాడు. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News