• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియ‌న్ ఐడిల్ పై...

ఇండియ‌న్ ఐడిల్ పై శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్!

By - Tupaki Desk
Update: 2018-04-05 12:33 GMT
కొద్దిరోజుల క్రితం సంచ‌ల‌నం రేపిన సుచీలీక్స్ త‌రహాలోనే ఇపుడు టాలీవుడ్ లో `శ్రీ రెడ్డి`లీక్స్ పెను దుమారం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి న‌టి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం విదిత‌మే. ప‌రోక్షంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ములనుద్దేశించి శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేయ‌డం...ఆ వ్యాఖ్య‌ల‌కు శేఖ‌ర్ క‌మ్ముల కూడా ప‌రోక్షంగా కౌంట‌ర్ ఇవ్వ‌డం జ‌రిగాయి. ఆ త‌ర్వాత తాను శేఖ‌ర్ క‌మ్ములనుద్దేశించి ఆ పోస్ట్ పెట్ట‌లేద‌ని శ్రీ‌రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. `నేచుర‌ల్ `హీరో అని పేరు ప్ర‌స్తావించకుండా ఓ టాలీవుడ్ హీరోపై కూడా శ్రీ‌రెడ్డి ఈ రోజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాజాగా, ప్ర‌ముఖ గాయ‌కుడు - ఇండియ‌న ఐడిల్ శ్రీ‌రామ‌చంద్ర‌పై కూడా శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేస్తూ త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.

సింగ‌ర్ శ్రీరామచంద్ర తనతో అసభ్యంగా చాట్ చేశాడ‌ని శ్రీ‌రెడ్డి ఆరోపించింది. శ్రీ‌రామ చంద్ర త‌న‌తో వాట్సాప్ లో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్ల‌ను త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మన ఇండియన్ ఐడిల్ చాట్ చూడండి.. శ్రీరామ్ సిగ్గుపడాలి..ముందు నీ పేరులోనుంచి శ్రీ‌రామ్ ను తొల‌గించు. ఆ పేరుతో పిలిపించుకునేందుకు నువ్వు అర్హుడివి కాదు’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, శ్రీ‌రెడ్డి స్క్రీన్ షాట్లు చూసిన నెటిజ‌న్లు మిశ్ర‌మంగా స్పందిస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్లలో పూర్తి చాట్ హిస్ట‌రీ లేద‌ని - ఎడిట్ చేసి ఉంద‌ని అంటున్నారు. అయితే, ఆ చాట్ లో సంభాష‌ణ ఇద్ద‌రికీ ఇష్ట‌పూర్వ‌కంగానే...స‌ర‌దాగా సాగింద‌ని అంటున్నారు. శ్రీ‌రామ చంద్ర స‌ర‌దాగా పెట్టిన కామెంట్ల‌కు శ్రీ‌రెడ్డి సీరియ‌స్ అయిన‌ట్లు ఆ స్క్రీన్ షాట్ల‌లో లేద‌ని - శ్రీ‌రెడ్డి కూడా అత‌డి మెసేజ్ ల‌కు స‌ర‌దాగానే రిప్లై ఇచ్చింద‌ని కామెంట్స్ పెడుతున్నారు.
Tags:    
  • Sri Reddy 
  • Indian Idol 
  • Sriram chandra 

Similar News

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

Copyright @2026

Powered by Blink CMS