ఉప్పెన హీరోయిన్ కంటే ఈమె మరీ లక్కీ

Update: 2021-10-25 04:09 GMT
ఏ భాష సినీ పరిశ్రమ అయినా కూడా బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం. మొదటి ఆఫర్‌ ను దక్కించుకునేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఒక సారి సక్సెస్ దక్కింది అంటే హీరోయిన్‌ గా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కొందరు హీరోయిన్స్ కు సక్సెస్ వచ్చినా పెద్దగా ఆఫర్లు వచ్చిన దాఖలాలు లేవు. కాని ప్లాప్ పడ్డ హీరోయిన్‌ కు వరుసగా ఆఫర్లు దక్కడం అంటే మామూలు విషయం కాదు. పెళ్లిసందD సినిమా హీరోయిన్ శ్రీలీలా గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ సినిమా విడుదలకు ముందు నుండే ఈమె కు మంచి ఫ్యూచర్‌ ఉంది అంటూ సినీ జనాలు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదటి సినిమా విడుదలకు ముందే రెండవ ఆఫర్ ను దక్కించుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న రవితేజ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో ఈమెకు హీరోయిన్‌ గా ఛాన్స్ దక్కింది. మొదటి సినిమా విడుదల అయిన తర్వాత అయ్యో ఈమెకు లక్‌ కలిసి రాలేదు. మరిన్ని ఆఫర్లు వస్తాయా అంటూ కొందరు అనుకున్నారు. కాని ఈమెకు మొదటి సినిమా ప్లాప్ పెద్దగా ప్రభావం పడలేదు. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అరడజను సినిమాలు ఆమె చెతిలోకి వచ్చాయనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అరవింద్ కు శ్రీలీలా బాగా నచ్చినట్లుంది. దాంతో ఆమెతో ఇప్పటికే గీతా ఆర్ట్స్ 2 కు గాను మూడు సినిమాలకు సైన్ చేయించారనే వార్తలు వస్తున్నాయి. బన్నీ వాసు ఇప్పటికే ఆమెకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్‌ పై సైన్‌ చేయించారని.. సినిమాలు ఏంటీ అనేది త్వరలో వెళ్లడి అయ్యే అవకాశం ఉందని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శ్రీలీలకు అంత పెద్ద బ్యానర్‌ లో ఏకంగా మూడు సినిమాలు చేసే అవకాశం దక్కడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం. శ్రీలీలా కు ఒక మెగా మూవీలో ఛాన్స్ వచ్చిందనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రాలేదు కాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో ఈమె చేయబోతున్న మూడు సినిమాల్లో ఖచ్చితంగా ఒక మెగా మూవీ ఉండే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా శ్రీలీల గురించే చర్చ జరుగుతోంది. రాఘవేంద్ర రావు ఎంతో మంది హీరోయిన్స్ ను పరిచయం చేశారు. వారిలో పలువురు స్టార్స్ అయ్యారు. ఇప్పుడు ఈమె కూడా స్టార్‌ హీరోయిన్ గా మారడం ఖాయం అనిపిస్తుంది.

ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన సినిమా తో హీరోయిన్‌ గా పరిచయం అయిన కృతి శెట్టి ప్రస్తుతం మోస్ట్ బిజీ హీరోయిన్ గా ఉంది. మొదటి సినిమా వంద కోట్ల సినిమా అవ్వడం వల్ల ఆమెకు ఆఫర్లు రావడం చాలా కామన్ విషయం. కాని శ్రీలీలకు మొదటి సినిమా డిజాస్టర్‌ అయ్యింది. అయినా కూడా ఈమెకు ఆఫర్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఈమెది కృతి శెట్టి కంటే మరింత అదృష్టం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు వీరిద్దరు ఖచ్చితంగా గట్టి పోటీ పడబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లక్ తో అనూహ్యగా దూసుకు వచ్చిన శ్రీలీలకు కృతి శెట్టిక మద్య పోటీ ఎంతలా ఉండబోతుంది.. ముందు ముందు వీరి లక్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. వీరు చేస్తున్న.. చేయబోతున్న సినిమాలు వచ్చే ఏడాది కనీసం రెండు అయినా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు సక్సెస్ అయితే టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో వీరిద్దరు చేరడం పక్కా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News