హ్యాపెనింగ్ తెలుగు బ్యూటీ చాందినీ చౌద‌రీతో స్పెష‌ల్ చిట్ చాట్

Update: 2020-12-04 03:34 GMT
- హా హా హా అవునండి, థ్యాంక్యూ సో మ‌చ్ గ‌త ఆరేళ్లుగా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసి ఇప్పుడు అన్నిటిఇ ఒకే మాదిరి తీసుకోవ‌డానికి అల‌వాటుప‌డుతున్నాను, అలానే మీరు అన్న‌ట్లుగా కరోనా లాక్ డౌన్ లో ఓటిటిలు ప్ర‌భావం ఇండ‌స్ట్రీ మీద కాస్త ఎక్కువ అవ్వ‌డం, నేను ఈ మ‌ధ్య‌నే న‌టించిన క‌ల‌ర్ ఫొటో ఓటిటిలో డైరక్ట్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో నేను ఆల్రేడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ తో పాటు కొత్త సినిమాలతో కాస్త బిజీగానే ఉన్నాను.

* చాందినీ కెరీర్ ని బిఫోర్ క‌ల‌ర్ ఫొటో అండ్ ఆఫ్ట‌ర్ క‌ల‌రో ఫొటో అని చెప్పొచ్చా

- నిస్సందేహంగా చెప్ప‌వ‌చ్చు, నా కెరీర్ స్టార్టింగ్ లోనే ఫ్లాపులు త‌గిలేయ‌డంతో స‌రైన హిట్ కోసం చాలా వెయిట్ చేస్తూ వ‌చ్చాను, క‌ల‌ర్ ఫొటోకి ముందు నేను న‌టించ‌న కొన్ని సినిమాలు బాగానే ఆడిన‌ప్ప‌టికీ క‌ల‌ర్ ఫొటో నాకు బాగా గుర్తింపు తెచ్చింది

* మీరు న‌టించిన మ‌రో సినిమా బొమ్ బాత్ కూడా ఓటిటిలోనే విడుద‌లైంది, థియేట‌ర్ కి దూరం అవుతున్న‌ట్లు అనిపించ‌డం లేదా

- ఇప్పుడున్న ప‌రిస్థితులు రీత్య థియేట‌ర్ లో సినిమా రిలీజ్ అవ్వ‌డం అనే కాన్సెప్ట్ ని ప‌క్క‌న పెడితే, సినిమా ఏదో మాదిరిగా ఆడియెన్స్ ద‌గ్గ‌రికి వెళితే చాలు అనే పొజిష‌న్ లో ఉన్నాం. విచిత్రం ఏంటంటే నేను న‌టించిన క‌ల‌ర్ ఫొటో సినిమా ఇప్పుడు బొమ్ బాత్ సినిమాను థియేట‌ర్ లో విడుద‌ల చేస్తే బాగుంటుంద‌ని చాలా మంది కాల్స్ చేసి చెబుతున్నారు, మీరు అన్న‌ట్లుగా థియేట‌ర్స్ ని దూరం అవుతున్నా అనే బాధ ఉన్న‌ప్ప‌టికీ ఏమ్ చేయ‌లేని ప‌రిస్థితి

* మీ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ ఏంటి

- తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తున్నాను, విశ్వ‌క్ సేన్ తో క‌లిసి న‌టిస్తున్నా, ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు చేద్దామ‌ని ప్లాన్ చేసుకుంటున్నా
Tags:    

Similar News