ట్రెండీ టాక్: ముంబైలో సొంతిల్లు కొనుక్కున్న సౌత్ స్టార్లు

Update: 2021-07-15 01:30 GMT
నెమ్మ‌దిగా సౌత్ స్టార్లు బొంబాయిలో ఇల్లు కొనుక్కుని అక్క‌డా త‌మ‌కంటూ ఒక అడ్డాను రెడీ చేసుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టికే ముంబై బ్యూటీ త‌మ‌న్నా కు ఫేజ్ 3 సెల‌బ్స్ నివాసం ఉండే ఖ‌రీదైన ఏరియాలో సొంత ఇల్లు ఉంది. త‌న త‌ల్లిదండ్రులు కుటుంబంతో అక్క‌డే నివ‌శిస్తుంది. ముంబై నుంచే చెన్న‌య్ హైద‌రాబాద్ ల‌ను ఆప‌రేట్ చేయ‌డం త‌మ‌న్నా స్టైల్.

ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ త‌న బిజినెస్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టుకునేందుకు ముంబై వెళితే ఇల్లు కావాల‌నుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా కాస్ట్ లీ ఏరియా ఖ‌ర్ లో స‌ముద్ర‌-ఫేసింగ్ వ్యూలో అద్భుత‌మైన అపార్ట్ మెంట్ ని కొనుక్కున్నారు. లాంచింగ్ కూడా జ‌రిగింది. 2015లోనే బ‌న్ని ఒక పోష్ ఏరియాలో 2 బీహెచ్ కే అపార్ట్ మెంట్ కొన్నారు. ప‌ది రోజుల్లో రెనోవేష‌న్ చేయించార‌ని క‌థనాలొచ్చాయి. ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్ ముంబైలో సెటిల్డ్ హీరోయిన్. త‌న భ‌ర్త‌తో క‌లిసి ఇటీవ‌ల ఒక కొత్త ఇంటిలో ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇటీవ‌ల వ‌రుసగా హిందీ చిత్రాల‌తో బిజీ అయిపోయిన ర‌ష్మిక మంద‌న ముంబైలోని ఒక ఇంటిని సొంతం చేసుకోవాల‌నుకుందిట‌.  ఇటీవ‌ల ఈ బ్యూటీ ఓ అపార్ట్ మెంట్ లోకి వెళ్లింది. కానీ అది అద్దె ఇల్లు మాత్ర‌మే. కానీ అలా ఉండ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేదు. అందుకే రష్మిక ఇప్పుడు ముంబైలో ఇల్లు కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిష‌న్ మ‌జ్ను- గుడ్ బాయ్ లాంటి చిత్రాల‌తో పాటు మ‌రో మూడు హిందీ చిత్రాల‌కు ర‌ష్మిక సంత‌కాలు చేసి స్పీడ్ మీద ఉంది. అందుకే వేగంగా ఇల్లు కొనుక్కుని ముంబైలో సెటిల‌వ్వాల‌ని భావిస్తోంది. అలా చేస్తే స్టార్ హోట‌ల్ లో ఇన్ సెక్యూర్డ్ గా బ‌స చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. రాశీ ఖ‌న్నా స‌హా ప‌లువురు సౌత్ లో పాపుల‌రైన క‌థానాయిక‌లు .. ప‌లువురు టాప్ రేంజ్ యాంక‌ర్లు ముంబైలో రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలు రావ‌డం సంచ‌ల‌న‌మైంది.

ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే చాలామంది స్టార్లు త‌మ‌కు వ‌చ్చే ఆదాయాన్ని తెలివిగా అపార్ట్ మెంట్ లు విల్లాలు భారీ భ‌వంతుల‌పై ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్థిరాస్తి రంగం తో పాటు షేర్ మార్కెట్ ని కూడా ఆశ్ర‌యిస్తార‌ని ఓ షేర్ బ్రోక‌ర్ వెల్ల‌డించారు.
Tags:    

Similar News