బ‌న్నీ, మ‌హేష్ బాలీవుడ్ లో అందుకే స్పెష‌ల్!

20 ఏళ్ల క్రితం నాటి చిత్రాల‌కు సైతం సీక్వెల్స్, వాస్త‌వ క‌థ‌ల్ని తెర‌కెక్కిస్తున్నారంటే? అక్క‌డ వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అద్దం ప‌డుతుంది.;

Update: 2026-01-20 02:45 GMT

కొంత కాలంగా బాలీవుడ్ లో సైతం తెలుగు సినిమాల‌దే హ‌వా. హిందీ మార్కెట్ లో తెలుగు సినిమాలు సాధిస్తోన్న వ‌సూళ్లే అందుకు నిద‌ర్శ‌నం. స్ట్రెయిట్ క‌థ‌ల‌తో హిట్ కొట్ట‌డం ప‌రిపాటిగా మారింది. అదే తెలుగు సినిమా ఖ్యాతిని బాలీవుడ్ లో రెట్టింపు చేసింద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. ఈ కార‌ణంగా బాలీవుడ్ మార్కెట్ లో తెలుగు సినిమాలు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లుగా మారుతున్నాయి. ప్ర‌త్యేకించి మ‌హేష్‌, బ‌న్నీ సినిమాల‌పై బాలీవుడ్ లో సైతం ఏ రేంజ్ లో అంచ‌నాలు నెల‌కొన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌న్నీ గ‌త సినిమా `పుష్ప 2` హిందీలో భారీ వ‌సూళ్ల‌ను సాధించింది.

బాలీవుడ్ హీరోల పేరిట ఉన్న రికార్డుల‌ను సైతం తిర‌గ‌రాసిన చిత్రంగా నిలిచింది. అత‌కు ముందు `బాహుబ‌లి`, `ఆర్ ఆర్ ఆర్`, `సాహో`, `జై హనుమాన్`, `స‌లార్` లాంటి చిత్రాలు హిందీ మార్కెట్ నుంచి మంచి ఓపెనింగ్స్ స‌హా వ‌సూళ్ల‌ను సాధించిన చిత్రాలే. ఇవ‌న్నీ అక్క‌డ కీల‌కంగా మార‌డానికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం కూడా ఉంది. ఇవ‌న్నీ స్ట్రెయిట్ స్టోరీల‌తో తెరకెక్కిన చిత్రాలే. రీమేక్ లు..సీక్వెల్స్ స్టోరీలు కాదు. బాలీవుడ్ అంటే సీక్వెల్స్, రీమేక్స్, ప్రాంచైజీలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో లైన్ లో ఉన్న సినిమాలు చూస్తే స‌గానికి పైగా రీమేక్ లు, సీక్వెల్స్, బ‌యోపిక్స్, ప్రాంచైజీలే ఉన్నాయి.

20 ఏళ్ల క్రితం నాటి చిత్రాల‌కు సైతం సీక్వెల్స్, వాస్త‌వ క‌థ‌ల్ని తెర‌కెక్కిస్తున్నారంటే? అక్క‌డ వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అద్దం ప‌డుతుంది. బ‌హుశా ఇవ‌న్నీ విశ్లేషించే అమీర్ ఖాన్, అమితాబ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ బాలీవుడ్ సినిమాల స్టోరీ విధానం మారాల‌ని భావించి ఉండొచ్చు. బ‌ల‌మైన కంటెంట్ హిందీ సినిమాల్లో క‌నిపించడం లేదని బ‌హిరంగంగానే అమీర్, షారుక్ ఖాన్ లాంటి వాళ్లు వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు కొంత మంది బాలీవుడ్ రైట‌ర్ల‌కు కూడా కోపం తెప్పించాయి. ఈ కార‌ణాల‌తో బాలీవుడ్ లో సౌత్ సినిమా ప్ర‌త్యేకంగా ఫోక‌స్ అవుతుంది.

అందులోనూ తెలుగు సినిమా ఇమేజ్ రెట్టింపు అవుతుంది. మ‌రికొంత మంది బాలీవుడ్ బిగ్ స్టార్స్ సైతం హిందీ రైట‌ర్ల కంటే సౌత్ రైట‌ర్లే ఉత్త‌మంగా ప‌నిచేస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇటీవ‌లే రిలీజ్ అయిన `ధురంధ‌ర్ `1300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అందుకు బాలీవుడ్ సంతోషంగా ఉంది. కానీ అది వాస్త‌వ సంఘ‌ట న‌లు ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం. ఓస్పై కథ‌ని క‌మ‌ర్శియ‌ల్ గా క‌నెక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసారు త‌ప్పా అదేమి కల్పిత క‌థ కాదు. బాలీవుడ్ కోరుకుంటోంది అది కాదు. నిఖార్సైన క్రియేటివిటీని కోరుకుంటుంది. 2026లోనైనా అలాంటి చిత్రాలు వ‌స్తాయ‌ని విశ్లేష‌కులు ఆశీస్తున్నారు.

Tags:    

Similar News