చిరు - నాని.. ఓదెల ప్లాన్ ఎలా ఉండబోతోంది?
సాధారణంగా పీరియడ్ డ్రామాలు తీయడంలో శ్రీకాంత్ ఓదెలకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. సెట్స్, కాస్ట్యూమ్స్ ఆ కాలపు వాతావరణాన్ని ఆయన చాలా సహజంగా చూపిస్తారు.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్నా తన మెగా హవాను ఏమాత్రం తగ్గించడం లేదు. సంక్రాంతికి వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఇక యంగ్ డైరెక్టర్ల విజన్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఆయన చేస్తున్న ప్రాజెక్టులు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ క్రమంలోనే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించనున్నారు. నాని నిర్మాణంలో మెగాస్టార్ సినిమా అంటే అది ఒక వెరైటీ కాంబినేషన్ అని చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే మాస్ అండ్ రా ఎంటర్టైన్‌మెంట్‌ను ఎలా డీల్ చేస్తారో నిరూపించుకున్నారు. నెక్ట్స్ నానితో చేయబోయే ది ప్యారడైజ్ కూడా అంతకుమించి అనేలా ఉండబోతోంది. ఇక చిరంజీవి కోసం కూడా ఆయన ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కథా నేపథ్యం వింటేజ్ స్టైల్‌లో ఉండబోతోందని సమాచారం.
అసలు విషయం ఏంటంటే, చిరుతో చేయబోయే సినిమా 1970 కాలమానం నేపథ్యంలో సాగే ఒక వింటేజ్ క్రైమ్ స్టోరీ అంట. డెబ్బైల నాటి పరిస్థితులు, ఆ కాలపు నేర సామ్రాజ్యం, ఒక పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో శ్రీకాంత్ ఓదెల ఈ కథను అల్లినట్లు తెలుస్తోంది. గతంలో శ్రీకాంత్ పోస్ట్ చేసిన 'బ్లడ్ ప్రామిస్' పోస్టర్ కూడా ఈ ఇంటెన్సిటీని బలపరుస్తోంది. చిరంజీవిని మళ్ళీ ఆ వింటేజ్ లుక్‌లో చూడాలని ఆశపడే ఫ్యాన్స్‌కు ఈ న్యూస్ ఒక బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
సాధారణంగా పీరియడ్ డ్రామాలు తీయడంలో శ్రీకాంత్ ఓదెలకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. సెట్స్, కాస్ట్యూమ్స్ ఆ కాలపు వాతావరణాన్ని ఆయన చాలా సహజంగా చూపిస్తారు. ఇప్పుడు చిరంజీవి వంటి బిగ్ స్టార్‌తో 1970 బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ స్టోరీ అంటే మేకింగ్ పరంగా ఇది నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. నాని ప్రొడక్షన్ విలువలు కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానున్నాయి. సినిమా అనౌన్స్‌మెంట్ నుండే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పీక్స్‌కు చేరిపోయాయి.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం అనిరుధ్‌తో కలిసి పని చేస్తుండటంతో, చిరు సినిమాకు కూడా ఆయననే ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. వింటేజ్ క్రైమ్ డ్రామాకు అనిరుధ్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో రచ్చ ఖాయం. మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ తరువాత బాబీతో సినిమా చేయనున్నాడు. ఆ సినిమా పూర్తి చేశాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఏదేమైనా చిరంజీవి, నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్టులా కనిపిస్తోంది. కేవలం కమర్షియల్ అంశాలే కాకుండా, కంటెంట్ పరంగా కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. 1970ల నాటి నేర ప్రపంచంలో మెగాస్టార్ చేసే ప్రయాణం ఆడియన్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ క్రేజీ వింటేజ్ డ్రామా గురించి మరిన్ని అఫీషియల్ డీటెయిల్స్ తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.