నాకు ఎలాంటి లిమిట్స్ లేవు.. ఐటెం సాంగ్స్ కు రెడీ!
ఛలో సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన రష్మిక చాలా తక్కువ టైమ్ లోనే అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.;
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎవరికి నచ్చింది వాళ్లు రాసేసుకుంటున్నారు. ఎదుటి వారు రాసిన దాంట్లో ఎంత నిజముందనేది కూడా పట్టించుకోకుండా ఆ వార్తలను ప్రచారం చేస్తుంటారు మరికొందరు. ఇలానే రూమర్లు మొదలవుతాయి. అయితే ఈ రూమర్లు పబ్లిక్ లైఫ్ లో ఉండే సెలబ్రిటీలపై ఎక్కువగా వస్తుంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మైసా షూటింగ్ లో రష్మిక బిజీ
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై కూడా ఇలాంటి వార్తలెన్నో వచ్చాయి. ఛలో సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన రష్మిక చాలా తక్కువ టైమ్ లోనే అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. గతేడాది కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించిన రష్మిక ప్రస్తుతం మైసా అనే సినిమాతో బిజీగా ఉన్నారు.
అప్పట్నుంచి ఒకేలా పని చేస్తున్నా
అయితే రష్మిక ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్ తో మాత్రం రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటారు. రీసెంట్ గా ఓ చిట్ చాట్ లో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలిస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు రష్మిక. తాను 2016 నుంచి ఇప్పటివరకు ఒకేలా పని చేస్తున్నానని, అన్ని భాషల్లో, అన్ని రకాల జానర్ల సినిమాల్లోనూ యాక్ట్ చేయాలనేదే తన కోరిక అని రష్మిక చెప్పుకొచ్చారు.
డబ్బు కోసమే రూమర్లు క్రియేట్ చేస్తారు
తనకు భాష పరంగా ఎలాంటి లిమిట్స్ లేవని, తాను నటినని, నటి పని ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమేననని, ఒక్కొక్కరికి ఒక్కో తరహా సినిమాలు నచ్చుతుంటాయని, అందుకే అందరినీ మెప్పించడానికి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంటానని ఆమె చెప్పారు. ఇక నెగిటివిటీ గురించి మాట్లాడుతూ, కొందరు కావాలని వ్యూస్ తో వచ్చే డబ్బు కోసం రూమర్లు క్రియేట్ చేస్తారని, మొదట్లో అవి విని చాలా బాధ పడ్డానని, తర్వాత వాటిని ఫేస్ చేయాలో నేర్చుకున్నానని, లైఫ్ లో జరిగిన ప్రతీ విషయం నుంచి ఏదొకటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నట్టు రష్మిక చెప్పారు.
నేనేమీ హీరోని కాదు
ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యనరేషన్ తీసుకునే హీరోయిన్ తానేనని వస్తున్న వార్తలపై కూడా రష్మిక రియాక్ట్ అయ్యారు. అందరూ అంటున్నట్టు, అనుకుంటున్నట్టు ఆ వార్త నిజమైతే బావుంటుందని, తాను కూడా దాని కోసమే వెయిట్ చేస్తున్నానని, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి తానేమీ హీరోని కాదని చెప్పిన రష్మిక, ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా తాను సిద్దమేనని, కానీ ఆ సినిమాలో లీడ్ రోల్ కూడా తానే చేయాలని అప్పుడే స్పెషల్ సాంగ్స్ చేస్తానని రష్మిక చెప్పారు. కాకపోతే ఓ ముగ్గురు డైరెక్టర్లు అడిగితే తాను లీడ్ రోల్ కాకపోయినా సరే వారి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీ అని, కానీ ఆ డైరెక్టర్లు ఎవరనేది మాత్రం తాను చెప్పనని రష్మిక వెల్లడించారు.