• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ క్రేజీ ఆఫర్స్...

బాలీవుడ్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న సౌత్ హీరోయిన్స్..!

By - Tupaki Desk
Update: 2021-05-27 07:36 GMT
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అనేవారు ఎప్పటికి ఫామ్ లోనే ఉంటారనే గ్యారంటీ లేదు. అలాగని అసలు ఫామ్ లోకి రారనేది కూడా లేదు. కానీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హీరోయిన్స్.. హీరోలు.. ఆర్టిస్టులు ఇలా ప్రతి విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇండస్ట్రీలో ఒక్కోసారి హీరోయిన్స్ కొరత కూడా కనిపిస్తుంది. అసలు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కరువు ఏంటనే సందేహం కలగవచ్చు. కానీ విషయం ఏంటంటే.. ఓ భాషలో హీరోయిన్స్ మరో భాషలో సినిమాలు చేయడం మాములు విషయమే. కానీ అసలు పరభాషా హీరోయిన్లను పిలవడానికి తమ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లేరా అనిపిస్తుంది. అయితే స్టార్ హీరోయిన్స్ ఎవరి దారి వారు చూసుకున్నాక మిగిలిన హీరోలకు కూడా స్టార్ హీరోయిన్స్ కావాలంటే ఖచ్చితంగా వేరే ఇండస్ట్రీ వైపు లుక్కు వేయాల్సిందే.

ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది బాలీవుడ్ ఇండస్ట్రీ. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వారందరిలో స్టార్డం కలిగిన హీరోయిన్స్ ఎంతమంది ఉంటారు. నిజానికి ఇండియా మొత్తం మీద హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఇండస్ట్రీ బాలీవుడ్ మాత్రమే. మరి అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ వైపు దృష్టి పెడుతోంది. అంటే బాలీవుడ్ లో హీరోయిన్స్ కరువైనట్లే కదా అంటున్నాయి సినీవర్గాలు. బాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరికొందరు ఫామ్ లో లేరు. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే స్టార్డం క్రేజ్ ఉన్నటువంటి హీరోయిన్స్ కావాలి. అందుకే ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సౌత్ హీరోయిన్లకు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నట్లు టాక్.

అయితే కొత్తవాళ్లతో సినిమా చేస్తే రిస్క్ అవుతుందేమో అని మేకర్స్ కూడా క్రేజ్ ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ సౌత్ లో స్టార్డం కలిగిన హీరోయిన్స్ పూజాహెగ్డే - రకుల్ ప్రీత్ సింగ్ - రష్మిక మందన - రెజినా లాంటి వారికీ అవకాశాలు కల్పించింది. ప్రస్తుతం వీరంతా సౌత్ లో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం వీరి చేతిలో బాలీవుడ్ సినిమాలున్నాయి. పూజాహెగ్డే.. సల్మాన్ ఖాన్ - రన్వీర్ సింగ్ లతో సినిమాలు చేస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ మూడు సినిమాలు చేస్తోంది. అలాగే రష్మిక మందన హిందీలో రెండు సినిమాలు చేయనుండగా.. రెజినా కూడా పలు సినిమాల గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అలాగే వీరంతా తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే వీరందరిలో కూడా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే చేతిలోనే క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పూజా చేతిలో కబీ ఈద్ కబీ దీవాలి - సర్కస్ సినిమాలతో పాటు ప్రభాస్ రాధేశ్యామ్ - దళపతి సరసన ఓ సినిమాలున్నాయి. మొత్తానికి పూజా క్రేజ్ మాములుగా లేదుగా..!
Tags:    
  • Pooja Hegde 
  • radhe shyam Movie 
  • Pooja Hegde Movies 
  • Pooja Hegde Latest Updates 
  • Pooja Hegde New Movies 
  • acharya 
  • pooja bollywood entry 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS