• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌ణిక‌ర్ణిక నుంచి ఆయనా...

మ‌ణిక‌ర్ణిక నుంచి ఆయనా ఔట్‌!

By - Tupaki Desk
Update: 2018-08-31 13:20 GMT
క్వీన్ కంగ‌న ప్ర‌స్తుతం `మ‌ణిక‌ర్ణిక` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధురాలు ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్ పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ పాత్ర కోసం కంగ‌న మార్ష‌ల్ ఆర్ట్స్‌ ని నేర్చుకుంది. వారియ‌ర్ క్వీన్‌లా క‌నిపించేందుకు తొలి నుంచి ఎంతో శ్ర‌మిస్తోంది. అయితే ఇలాంటి భారీ హిస్టారిక‌ల్ మూవీ తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు కొన్ని అడ్డంకులు - ఇబ్బందులు త‌ప్ప‌వు. ప్ర‌స్తుతం అలాంటి స‌న్నివేశ‌మే ఎదుర్కొంటోంది కంగ‌న‌.

గ‌త కొంత‌కాలంగా ద‌ర్శ‌కుడు క్రిష్‌తో విభేధాలు రావ‌డంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదీ స‌రిగా కుద‌ర‌లేద‌ని ప్ర‌చార‌మైంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌ తో క్రిష్ బిజీగా ఉండ‌డంతో అది నిజ‌మేన‌ని అంతా భావిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా `ద‌ర్శ‌క‌త్వం: క‌ంగ‌న‌` అంటూ క్లాప్‌ బోర్డ్‌ లో క‌నిపించ‌డంతో క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్టేన‌న్న ప్ర‌చారం సాగుతోంది. క్రిష్ త‌ప్పుకోలేదు అంటూనే కంగ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ప్యాచ్‌ వ‌ర్క్‌ ని పూర్తి చేసేస్తోంది.

తాజాగా మ‌రో ఊహించ‌ని స‌న్నివేశం మ‌ణిక‌ర్ణిక టీమ్‌కి ఎదురైంది. కొన్ని స‌న్నివేశాల్లో న‌టించాక.. ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని సోనూసూద్ ప్ర‌క‌టించాడు. చివ‌రి నిమిషంలో మ‌ణిక‌ర్ణిక టీమ్ మార్పులు చెప్ప‌డంతో అత‌డు ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం `సింబా` చిత్రంలో న‌టించేందుకు ప్రిప‌రేష‌న్‌ లో ఉన్న సోనూ సూద్ బాగా గ‌డ్డం పెంచాడు. అత‌డు మ‌ణిక‌ర్ణిక షూట్‌ లో పాల్గొనాలంటే ఆ గ‌డ్డం తీసేసి - క్లీన్ షేవ్‌ తో క‌నిపించాల్సి ఉంటుంది. కానీ అందుకు స‌సేమిరా! అని అంటున్నాడు సోనూ. `సింబా`కి క‌మిట‌య్యాను. మాట త‌ప్ప‌లేను అని తెలిపాడు. త‌న ప్లేస్‌ లో వేరొక‌రితో చిత్రీక‌ర‌ణ పూర్తి చేయాల్సిందిగా కోరుతూ మ‌ణిక‌ర్ణిక టీమ్‌ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. క‌మిట్‌ మెంట్ విష‌యంలో ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ఉండే సోనూసూద్ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఒక‌వేళ తాను మ‌ణిక‌ర్ణిక షూటింగ్‌ లో పాల్గొనాలంటే `సింబా` షెడ్యూల్ పూర్త‌య్యాక గ‌డ్డం లేకుండా ఎటెండ‌వుతాన‌ని - అంత వ‌ర‌కూ వేచి చూడలేని ప‌రిస్థితిలో త‌న పోర్ష‌న్ మొత్తం వేరొక‌రితో షూట్ చేస్కోండ‌ని ఖ‌రాకండిగా తేల్చి చెప్పేశాడు సోనూ. ఒక‌రికి ఇచ్చిన క‌మిట్‌ మెంట్‌ లో మార్పు ఉండ‌ద‌ని తెలిపాడు. దీంతో మ‌రోసారి మ‌ణిక‌ర్ణిక టీమ్ సందిగ్ధంలో ప‌డిన‌ట్ట‌య్యింది. మొత్తానికి  ఈ హిస్టారిక‌ల్ సినిమాకి ఆదిలోనే బోలెడ‌న్ని అడ్డంకులు త‌ప్ప‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది.
Tags:    
  • Sonu Sood 
  • Kangana Raunat 
  • Manikarnika 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS