సుశాంత్ డైరీలోని కొన్ని పేజీలు మాయం...!

Update: 2020-08-07 10:50 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సుశాంత్ కేసులో కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని సుప్రీంకోర్టుకు తెలపడంతో సర్వోన్నత న్యాయస్థానం సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్‌ కేసులో ఆరుగురిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఏ1 నిందితురాలుగా ప్రకటించింది. ఆమెతో పాటు ఏ2గా రియా తం‍డ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, ఏ3గా తల్లి సంధ్య చక్రవర్తి, ఏ4గా సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఏ5గా సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరిండా, ఏ6గా  సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీలను నిందితులుగా చేర్చిందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ కేసులో కీలకమైన సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్‌ కు చెందిన డైరీలో కొన్ని పేజీలు మిస్ అయినట్టు అధికారులు గుర్తించారు. దీంతో సుశాంత్ మృతిపై ఇప్పటివరకు వ్యక్తమవుతున్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ డైరీలో సుశాంత్ తన రోజువారీ సంబంధించిన విషయాలను రాసేవాడేని ఆయన సన్నిహితులు వెల్లడించారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి కూడా సుశాంత్ డైరీలో పేజీలు మాయమైన విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు సుశాంత్ డైరీలో కొన్ని పేజీలు మిస్సవడంతో యువ హీరో మృతి చెందడం వెనుక అసలు కారణం ఏమిటనే విషయం సంచలనంగా మారింది. ముంబై పోలీసులు కావాలనే ఈ విషయాన్ని ఇన్ని రోజులు బయటకు రాకుండా చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News