ఇన్ స్టాగ్రామ్ లేకపోతే హీరోయిన్స్ పరిస్థితి ఏంటి?
సెలబ్రిటీలు అనగానే వారికి ముఖ్యంగా కావలసింది డబ్బు అని ఎక్కువమంది అనుకుంటారు కానీ దాని కంటే ముఖ్యమైనది ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండడం. ఓ రెండు నెలలు కనుక ఒక సెలబ్రిటీ గురించి ఎటువంటి న్యూస్ రాలేదంటే సగం మంది సాధారణమైన ప్రేక్షకులు వారిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. నాలుగైదు నెలలు వారికి సంబంధించిన న్యూస్ లేకపోతే నిజంగానే మర్చిపోతారు. హీరోయిన్ల విషయం మరీ కష్టం. ఎందుకంటే ముంబై నుంచి అదే పనిగా ఇంపోర్ట్ అవుతూ ఉంటారు కదా ఒక హీరోయిన్ నాలుగు నెలలు లైమ్ లైట్ లో లేదంటే ఆ హీరోయిన్ అవుట్ అన్న లెక్క. ఆ స్థానాన్ని మరో హీరోయిన్ భర్తీ చేస్తుంది అంతే.
అందుకే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లకు ఈ లాక్ డౌన్ కారణంగా పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమా షూటింగులు లేవు.. షాపుల రిబ్బన్ కటింగులు లేవు.. ఇతరత్రా కార్యక్రమాలు అంతకంటే లేవు.. వెకేషన్ కి తీసుకెళ్లే వారు లేరు.. ఇంట్లో పనులు చేసిపెట్టే వారు అంతకంటే లేరు. ఈ సమయంలో నిజానికి వారందరినీ సోషల్ మీడియా ఆదుకుంటోంది. సాధారణమైన పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఈ హీరోయిన్లను.. వారికి సంబంధించిన విశేషాలను కవర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు అలా చేసే అవకాశమే లేదు ఎందుకంటే కవర్ చేయడానికి పోతే నిజంగానే పోతామని భయం. అందుకే హీరోయిన్లు ఇన్ స్టా పై ఆధారపడుతున్నారు. సొంతంగా తమ గురించి తాము ప్రచారం చేసుకుంటున్నారు. అందాల విందు చేయడం.. లేక పిల్లో ఛాలెంజ్.. హ్యాండ్ స్టాండ్ చాలెంజ్.. ఇలా ఎన్నో రకాల చాలెంజ్ లలో పాల్గొనడం లైం లైట్ లో ఉండడానికి చేస్తున్న ప్రయత్నమే.
కొందరు హీరోయిన్లు అంట్లు తోముతూ.. మరికొందరు ఇంటిని ఊడుస్తూ.. మరికొందరు కసరత్తులు చేస్తూ ఇలా నెటిజన్లకు ఈ లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తున్నామో చెప్పుకుంటున్నారు. ఇలా చేస్తూ నిత్యం వారితో టచ్లో ఉంటున్నారు. మీకు ఈ విషయంలో ఏమైనా అనుమానం ఉంటే ఒక పని చేయవచ్చు. ఈమధ్య ఏదో ఒక వింతలు చేసి వీడియోలు పెట్టిన హీరోయిన్ ల పేర్లు మీరు జస్ట్ కళ్లు మూసుకుంటే గుర్తొస్తాయి. మిగతా హీరోయిన్ల పేర్లు గుర్తు రావడానికి మీరు ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సి ఉంటుంది.
ఇక నెటిజన్లు అందరూ కూడా దాదాపుగా ఇళ్లలోనే ఉండడంతో ఈ సెలబ్రిటీల వ్యవహారాలను గమనిస్తూ టైం పాస్ చేస్తున్నారు. అసలే కరోనా అంటూ తల బద్దలు కొడుతున్న బ్రేకింగ్ న్యూస్ ల నుంచి హీరోయిన్ల చిత్రవిచిత్ర వేషాలు కాస్త రిలీఫ్ ఇస్తున్నాయి. చాలామంది వీటికి కామెంట్లు పెడుతూ లైకులు కొడతారు టైం పాస్ చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం. సోషల్ మీడియా కనుక లేకపోతే ఈపాటికి సగం మందికి పైగా హీరోయిన్లను జనాలు పూర్తిగా మర్చిపోయి ఉండేవారు.