మీ పీఆర్ కోసం నా పేరు వాడకండి!

Update: 2019-06-25 08:24 GMT
ఫిలిం ఇండస్ట్రీలో గాసిప్పులు చాలా కామన్.  ఒక ప్రాజెక్టు చర్చల దశ నుండి మొదలు పెట్టి రిలీజ్ అయ్యేంతవరకూ పదుల సంఖ్యలో గాసిప్పులు వస్తాయి.  అసలు సినిమా మీద ఒక్క గాసిప్ కూడా రాలేదు అంటే..  ఆ సినిమా ఖచ్చితంగా ఊరుపేరు సినిమా అని.. జనాలు పట్టించుకోని సినిమా అని మనం అనుకోవచ్చు. అయితే ఈమధ్య సినిమాలే కాదు బిగ్ బాస్ లాంటి టీవీ రియాలిటి షోస్ పై కూడా గాసిప్పులపై గాసిప్పులు ప్రచారంలోకి వస్తున్నాయి.  హోస్ట్ ఎవరు దగ్గర నుంచి మొదలు పెడితే.. కంటెస్టెంట్లు ఎవరు అనేదాకా చాలా పుకార్లు వస్తుంటాయి.

బిగ్ బాస్ సీజన్ 3 త్వరలోనే ప్రారంభం కానుందన్న సంగతి తెలిసిందే.  ఈ సీజన్ లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని క్లారిటీ వచ్చేసింది. కానీ పార్టిసిపెంట్స్ విషయంలో చాలా వార్తలు వస్తున్నాయి.  అలానే తెలుగు భామ.. తెనాలి పాప.. బాలీవుడ్ బ్యూటీ.. 'గూఢచారి' హీరోయిన్ అయిన శోభిత ధూళిపాళ బిగ్ బాస్ లో పాల్గొంటుందనే వార్తలు రావడంతో కొందరు నిజమే అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఈ విషయంపై శోభిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫుల్ క్లారిటీ ఇస్తూ "ఈ బిగ్ బాస్ తెలుగు విషయంలో నా ప్రమేయం లేదు.  మీ పీఆర్ కోసం నా పేరు దయచేసి వాడకండి" అంటూ ట్వీట్ చేసింది.

అర్థం అయింది కదా.. తెలుగు బిగ్ బాస్ లో శోభిత పాల్గొనడం లేదు. అవన్నీ పుకార్లే! శోభిత ప్రస్తుతం నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్న మలయాళం-హిందీ ద్విభాషా చిత్రం 'మూతోన్' లో హీరోయిన్ గా నటిస్తోంది. 'సేక్రేడ్ గేమ్స్ 2'.. 'బార్డ్ ఆఫ్ బ్లడ్' అనే వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.  తెలుగులో 'గూఢచారి' తర్వాత మరో సినిమాకు సైన్ చెయ్యలేదు.


Tags:    

Similar News