టీజర్‌ టాక్‌ః అనుష్క కామెడీ వెయిటే!!

Update: 2015-08-31 09:31 GMT

Full View
వెయిట్‌ అంటే .. వేచి చూడడం.. లేకపోతే బరువు.. ఇలా తెలుగులో రాసుకుంటే రెండింటికీ ఒకే పదం. ఇకపోతే వెయిట్‌ చేస్తున్న కామెడీ ప్రియులకు ఇప్పుడు తన వెయిట్‌ తో కితకితలు పెట్టడానికి హీరోయిన్‌ అనుష్క వచ్చేసింది. అదే ''సైజ్‌ జీరో''.

దర్శకదిగ్గజం రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి ఇప్పుడు అనుష్కను హీరోయిన్‌ గా లీడ్‌ లో పెట్టి సైజ్‌ జీరో అనే సూపర్‌ కామెడీ సినిమాతో వస్తున్నాడు. లావుగా ఉండేవారు సోసైటీ లో పడే బాధలు, వారి ఇబ్బందులు, వాటివలన సోసైటీలో క్రియేట్‌ అయ్యే కామెడీ ఒకెత్తయితే, అసలు ఫుడ్‌ హ్యాబిట్ లు మార్చుకుంటే వారు ఎలా సన్నబడాలో చెప్పే సినిమా ఇది. ప్రకాష్‌ భార్య కనిఖా దిల్లాన్‌ ఈ సినిమా కథను రాసింది. చూస్తుంటే ప్రతీ ఫ్రేములోనూ అనుష్క కామెడీ అదిరిపోయింది అనిపించట్లేదూ. అదిరిపోయిందంతే. అయితే ఈ కామెడీలో ఆమెను పెళ్ళిచేసుకోవడానికి వచ్చే మొగుడుగా ఆర్య, మధ్యలో మరో సెకండ్‌ హీరోయిన్‌ గా సోనాల్‌ చౌహాన్‌, అలాగే ప్రత్యేక పాత్రలో కింగ్‌ నాగర్జున, ఓ స్పెషల్‌ సాంగులో శృతి హాసన్‌ అదరగొట్టనున్నారు.

ఇకపోతే అనుష్క వంటి హెవీ వెయిట్‌ పర్సనాలిటీ వెయిట్‌ చూస్కోవడానికి ఓ వెయింగ్‌ మెషీన్‌ ఎక్కితే ఏంటి పరిస్థితి? ఆ కార్డు మీద వెయిట్‌ ఎంత ఉండొచ్చు, అలాగే కార్డు వెనుక లక్కీ మాటలు ఏమైయుండొచ్చు? ప్రస్తుతానికైతే సెప్టెంబర్‌ 6న ఆడియో అని మాత్రమే ఆ కార్డు సూచించింది.
Tags:    

Similar News