ట్రైలర్ టాక్: బోల్డ్ బ్లాస్ట్ అండ్ బ్యూటీ
కొత్త తరహా మోడరన్ సినిమాకు ఊపిరిలూదే క్రమంలో దర్శకులు సృజనాత్మక అడుగులు వేస్తున్నారు. అలా అనిపిస్తున్న కొత్త సినిమా సీతా ఆన్ ది రోడ్. ఓ ఇద్దరు తప్ప అందరూ నూతన నటీనటులతో చేసిన ఈ ప్రయత్నంలో చాలా బోల్డ్ నెస్ కనిపిస్తోంది. ఐదుగురు అమ్మాయిలు. ఐదు విభిన్నమైన జీవితాలు. సంబంధం లేని గమ్యాలు. కానీ ఏదో ఒక రూపంలో సమాజంలో సాధక బాధలు ఎదురుకున్నవారే.
సవాళ్ళకు ఎదురు నిలిచి కట్టుబట్లను ప్రశ్నించిన వాళ్లే. అందరూ కలిసి సమాధానం లేని ప్రశ్నలకు బదులు ఇచ్చేందుకు రోడ్ జర్నీకి బయలుదేరుతారు. అదే సీత ఆన్ ది రోడ్. వీరిలో సీత ఎవరు వీళ్లంతా ఎలా కలుసుకున్నారు అనేదే మెయిన్ థీమ్ గా కనిపిస్తోంది
ట్రైలర్ లో డెప్త్ ఉంది. ఉన్నదున్నట్టుగా ఏ గుట్టు లేకుండా దర్శకుడు కం సంగీత దర్శకుడు ప్రణీత్ యారోన్ బోల్డ్ అటెంప్ట్ చేశాడు. కల్పిక గణేష్-గాయత్రి గుప్తా-ఖతెరా హకిమి-నేస ఫర్హాది-ఉమ లింగాయ్ నేటి తరం ప్రతినిధులుగా పాత్రల్లో బాగా ఒదిగిపోయారు. నేటి మహిళలను పట్టి పీడిస్తున్న సమస్యలను లింక్ చేసుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. స్త్రీల సాధికారత గురించి అల్లుకున్న కథ అయినప్పటికీ అన్ని వర్గాల యూత్ కి కనెక్ట్ అయ్యేలాగే ఉంది.
Full View