అవతార్ 3.. ఓపెనింగ్స్ సంగతేంటి?

ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ డైరెక్షన్‌ లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్ థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;

Update: 2025-12-19 12:20 GMT

ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ డైరెక్షన్‌ లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్ థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అవతార్ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా తెరకెక్కిన ఆ సినిమా సందడి నిన్న ప్రీమియర్స్ తో మొదలైంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ చిత్రం.. నేడు వరల్డ్ వైడ్ గా విడుదలైంది.

దాదాపు 400 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3600 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో నిర్మితమైన అవతార్ 3 ఓపెనింగ్స్ ఎలా ఉండనున్నాయోనని ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తొలి రోజు వసూళ్లు 340 మిలియన్ డాలర్ల నుంచి 380 మిలియన్ డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వెలువడుతున్నాయి.

అమెరికా డొమెస్టిక్ మార్కెట్ నుంచి దాదాపు 90 మిలియన్ డాలర్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి 250 మిలియన్ డాలర్లకు పైగా వసూలు అయ్యే అవకాశం ఉందని వెల్లడించాయి. అయితే 340 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ సాధించడం దాదాపు ఖాయమని కూడా అంచనా వేస్తున్నాయి.

అయితే ట్రేడ్ వర్గాలు చేస్తున్న అంచనాలు.. మార్వెల్, డీసీ వంటి సూపర్‌హీరో సినిమాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. కానీ అవతార్ ఫ్రాంచైజీకి ఇది మాత్రం మంచి ఆరంభమనుకోవాలి. కానీ ఇప్పుడు అవతార్-3 మూవీకి రివ్యూస్ మిక్స్ డ్ గా వస్తున్నాయి. యాక్ష‌న్ ఘ‌ట్టాలు, విజువ‌ల్స్ అదిరిపోయాయని సినీ ప్రియులు చెబుతున్నారు.

కానీ సినిమా స్టోరీలో కొత్తదనం మిస్ అయిందని, ఎమోషన్స్ లో డెప్త్ తక్కువైందని అంటున్నారు. అయితే జేమ్స్ కామెరూన్ సినిమాలకు ఉండే ప్రత్యేకత, విజువల్ ఎక్స్పీరియన్స్, అవతార్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ బట్టి.. భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలు లేవని చెప్పలేమని కూడా ఇప్పుడు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

అయితే అవతార్-1 మూవీ.. 2.92 బిలియన్ డాలర్లకు వసూలు చేసి అదరగొట్టింది. వినూత్న విజువల్ ఎఫెక్ట్స్, 3D టెక్నాలజీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండో భాగం అవతార్: ది వే ఆఫ్ వాటర్ అనుకున్నట్లు ఆకట్టుకోకపోయినా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 2.32 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇప్పుడు మూడో భాగం ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News