శ్రీజ మాజీ భర్త గురించి.. అంతా ఉత్తిదే

Update: 2016-03-29 07:43 GMT
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. నిన్నే కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. బెంగళూరులోని తన ఫామ్ హౌజ్ లో శ్రీజ పెళ్లి అంగరంగ వైభవంగా చేయించాడు మెగాస్టార్. తన చిన్ననాటి స్నేహితుడు.. బిజినెస్ మ్యాన్ అయిన కళ్యాణ్ ను పెళ్లాడింది శ్రీజ. ఐతే శ్రీజ తన రెండో పెళ్లికి సిద్ధమైనప్పటి నుంచి ఆమె మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ గురించి కొన్ని రూమర్లు వినిపిస్తూ వస్తున్నాయి. శిరీష్ కూడా ఈ మధ్యే పెళ్లి చేసుకున్నాడని.. శ్రీజతో విడిపోయిన కొన్నాళ్లకే అతడికి వేరే అమ్మాయితో పరిచయమై.. అది ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. శిరీష్ మళ్లీ పెళ్లి చేసుకోలేదని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

శ్రీజతో విడిపోయాక రాజకీయాల్లోకి అడుగుపెట్టి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న శిరీష్.. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. పార్టీలకు, పబ్ లకు రెగ్యులర్ గా వెళ్లే అలవాటు ఉన్నప్పటికీ శిరీష్ కొత్తగా ఏ రిలేషన్ షిప్ మొదలుపెట్టలేదని సన్నిహితులు చెబుతున్నారు. 2007లో శ్రీజ-శిరీష్ హఠాత్తుగా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని చిరు కుటుంబానికి పెద్ద షాకిచ్చారు. తనకు తన కుటుంబం కంటే శిరీషే ముఖ్యమంటూ అతడితో వెళ్లిపోయింది శ్రీజ. వీళ్లిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. అన్నీ సర్దుకుంటాయిలే అనుకుంటుంటే.. శ్రీజ-శిరీష్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. తనను శిరీష్ కట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి నుంచి విడిపోయి తన తండ్రి దగ్గరికి చేరింది శ్రీజ. తర్వాత ఇద్దరికీ విడాకులు కూడా వచ్చాయి. ప్రస్తుతం శ్రీజ కూతురు తన దగ్గరే ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా శ్రీజ-కళ్యాణ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ ఈ గురువారం హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Tags:    

Similar News