52 ఏళ్లలో కుర్ర హీరోలు సైతం కుళ్లుకునేలా..
తాజాగా బ్లూ కలర్ టీ షర్టు, షార్ట్ ధరించిన సోను సూద్ తన సిక్స్ బ్యాక్ బాడీని చూపిస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటోలను షేర్ చేశారు.;
ఆరోగ్యమే మహాభాగ్యం.. వేలకోట్లు ఆస్తులు ఉన్నా.. ఆరోగ్యంగా లేకపోతే అదంతా వృధానే. అందుకే మనం ఆరోగ్యంగా ఉంటే మన దగ్గర డబ్బు లేకపోయినా మనమే అందరికంటే గొప్పవాళ్ళం. ఇకపోతే ఆరోగ్యంగా ఉండడానికి.. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి ముఖ్యంగా సెలబ్రిటీలు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నిత్యం జిమ్ సెంటర్లో కష్టమైన వ్యాయామాలు చేస్తూ తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వయసు మీద పడినా.. ఇంకా హీరోలుగా, హీరోయిన్లుగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే నాగార్జునను మొదలుకొని టబు వంటి సెలబ్రిటీల వరకు చాలామంది వయసు మీద పడినా.. ఇంకా స్టిల్ యంగ్ లాగే కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు . ఇప్పుడు ఈ జాబితాలోకి రియల్ హీరో సోనూ సూద్ కూడా వచ్చి చేరారు. ప్రస్తుతం ఆయన వయసు 52 సంవత్సరాలు. అయితే తాజాగా జిమ్ సెంటర్ నుండి సిక్స్ ప్యాక్ బాడీను చూపిస్తూ.. ఫోటోని షేర్ చేయడంతో ఈ వయసులో కూడా ఇంత ఫిట్నెస్ అంటూ అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా బ్లూ కలర్ టీ షర్టు, షార్ట్ ధరించిన సోను సూద్ తన సిక్స్ బ్యాక్ బాడీని చూపిస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలలో సోనూ సూద్ లుక్స్ చూసిన అభిమానులు 52 ఏళ్లలో కూడా ఈ రేంజ్ బాడీ అంటే నిజంగా ఆయన శరీరాకృతికి , అంకిత భావానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే సోను సూద్ షేర్ చేసిన ఈ సిక్స్ ప్యాక్ బాడీ ఫోటోలు చూసి కుర్ర హీరోలు కూడా కుళ్ళుకుంటున్నారని నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సోనుసూద్ విషయానికి వస్తే.. ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు రియల్ హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. కరోనా సమయం నుంచి ఈయన సేవలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది కరోనా బాధితులకు అండగా నిలిచిన ఈయన వలసదారులను తిరిగి వారి గమ్యాలకు చేర్చడంలో మొదటి పాత్ర వహించారు. అంతేకాదు నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఈయన ఆర్థికంగా ఎంతో మందికి అండగా నిలిచారు. ఇకపోతే ఇటీవల 500 మంది మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ కు ట్రీట్మెంట్ ఇప్పించి.. వారి జీవితంలో కొత్త వెలుగులు నింపారు. అంతేకాదు త్వరలో మరికొంతమందికి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని కూడా తెలిపారు సోనూ సూద్.
సోనూసూద్ చిత్రాల విషయానికొస్తే.. నాగార్జున , అనుష్క శెట్టి కాంబినేషన్లో ఇచ్చిన సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈయన.. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మరింత ఇమేజ్ దక్కించుకున్నారు. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఎక్కువగా విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.