ఆదర్శ కుటుంబం దసరాకే ఫిక్స్..?

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ మూవీ రేంజ్ కి తగినట్టుగానే నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు.;

Update: 2025-12-18 05:38 GMT

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ మూవీ రేంజ్ కి తగినట్టుగానే నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. వెంకటేష్ త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను హారి హాసిని ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటింగ్ వర్క్ చేశారు. ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

సమ్మర్ కన్నా సెకండ్ హాఫ్ లో పెద్ద పండుగ దసరాకి..

ఐతే ఇప్పుడు ఆదర్శ కుటుంబం అంటూ వెంకటేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాను ఈమధ్యనే షూటింగ్ మొదలు పెట్టగా 2026 సమ్మర్ కి రిలీజ్ అని చెప్పుకొచ్చారు. ఐతే సినిమా సమ్మర్ కి రెడీ అయినా సమ్మర్ కన్నా సెకండ్ హాఫ్ లో పెద్ద పండుగ అదే దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తే బెటర్ అనే టాక్ నడుస్తుంది. 2026 సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఫౌజీ ఒకటి రిలీజ్ ప్లానింగ్ ఉంది. ఎలాగు జనవరికి రాజా సాబ్ తో వస్తున్నాడు కాబట్టి కాస్త లేట్ అయినా పర్లేదని ఫౌజీని డిసెంబర్ లేదా అంతకన్నా ముందు అంటే ఆగష్టులో రిలీజ్ చేసినా చేయొచ్చు.

వెంకటేష్ సినిమా సమ్మర్ కన్నా దసరా ఫెస్టివల్ సీజన్ అయితే దసరాకి ఫ్యామిలీతో కలిసి చూసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆదర్శ కుటుంబం రిలీజ్ ప్లానింగ్ లో ఛేంజ్ ఉంటుందని అనిపిస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ తో జత కడుతుంది కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఇప్పుడిప్పుడే అమ్మడు తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. హిట్ 3, తెలుసు కదా సినిమాలతో అమ్మడు మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

ఆదర్శ కుటుంబం కోసం వెంకటేష్ తో పాటు త్రివిక్రమ్..

ఇక త్రివిక్రమ్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. వెంకటేష్ ఈ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ ఒక యువ హీరోతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట. వెంకటేష్ తో పాటు త్రివిక్రం కూడా ఆదర్శ కుటుంబం సినిమాను సంక్రాంతికి వస్తున్నాం కన్నా సూపర్ హిట్ చేసేలా చూస్తున్నారు. ఇక గురూజీ కూడా వెంకీ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ తను చేయాలనుకున్న మైథాలజీ సబ్జెక్ట్ మీద మరింత గురి పెట్టాలని చూస్తున్నారు.

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేసే మైథాలజీ మూవీ మరింత లేట్ అయ్యే ఛాన్స్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే నీల్ తో తారక్ చేస్తున్న సినిమా ఇంకా పూర్తి కాలేదు ఓ పక్క కొరటాల శివతో దేవర 2 ఉంటుందా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. సో ఈ టైంలో గురూజీ సినిమా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదనిపిస్తుంది.

Tags:    

Similar News