శర్వానంద్ బైకర్ కి అది ప్లస్ అవుతుందా..?

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ అసలైతే డిసెంబర్ మొదటి వారమే బైకర్ తో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.;

Update: 2025-12-18 08:30 GMT

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ అసలైతే డిసెంబర్ మొదటి వారమే బైకర్ తో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఐతే ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. ఐతే డిసెంబర్ 5న శర్వానంద్ బైక్ రిలీజ్ షెడ్యూల్ చేయగా మళ్లీ నెక్స్ట్ మంత్ లోనే అంటే జనవరిలోనే సంక్రాంతికి శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. నారి నారి నడుమ మురారి సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అనేస్తున్నారు మేకర్స్.

మంచి ఫ్యామిలీ విత్ ఫన్ ఎలిమెంట్స్ తో నారి నారి నడుమ మురారి..

ఐతే బైకర్ వాయిదా పడింది కానీ నారి నారి నడుమ మురారి మాత్రం అనుకున్న డేట్ కే వస్తుంది. సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాం అబ్బరాజు ఈసారి డబల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా చేశాడు. సంక్రాంతికి వచ్చే ఈ సినిమా సక్సెస్ అయితే బైకర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. నారి నారి నడుమ మురారి సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ విత్ ఫన్ ఎలిమెంట్స్ తో వస్తుంది.

సినిమాలో అందాల భామలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కొన్నాళ్లుగా శర్వానంద్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలు అందుకోవట్లేదు. చివరి సినిమా మనమే కూడా నిరుత్సాహపరిచింది. అందుకే బైకర్, నారి నారి నడుమ మురారి రెండు డిఫరెంట్ సినిమాలతో శర్వానంద్ వస్తున్నాడు. నారి నారి హిట్ పడితే కచ్చితంగా బైకర్ కి మంచి క్రేజ్ వస్తుంది.

బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో బైకర్..

ఇక బైకర్ విషయానికి వస్తే తెలుగు తెర మీద ఒక బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి సినిమా ఇదే. కంప్లీట్ గా ప్రొఫెషనల్ బైక్ రేసింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. సో ఎన్.ఎన్.ఎన్.ఎం ముందు బైకర్ రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఆ సినిమా వచ్చాక బైకర్ వస్తుంది కాబట్టి నారి నారి ప్రేక్షకులకు కనెక్ట్ అయితే బైకర్ కి మంచి పుష్ ఇచ్చినట్టే అవుతుంది.

శర్వానంద్ మాత్రం ఈ రెండు సినిమాల మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సరైన సక్సెస్ లేక కెరీర్ లో కాస్త వెనకపడి ఉన్న శర్వానంద్ కి ఈ రెండు సినిమాలు ఎలాంటి జోష్ అందిస్తాయన్నది చూడాలి. రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ కథలతో వస్తున్నాయి కాబట్టి కచ్చితంగా శర్వానంద్ క్యారెక్టరైజేషన్ లోని వేరియేషన్స్ అతన్ని ఇష్టపడే వారికి సినీ లవర్స్ ని మెప్పిస్తాయని చెప్పొచ్చు. నారి నారి కోసమేమో కానీ బైకర్ కోసం మాత్రం శర్వానంద్ మేకోవర్ ఇంకా రియల్ స్టంట్స్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నాడని తెలుస్తుంది.

Tags:    

Similar News