ఈ సంవత్సరం అత్యంత పేరు తెచ్చుకున్నవాళ్లు వీళ్లే గురూ..!
ఈ రౌండ్‌టేబుల్‌లో భాగంగా విడుదలైన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు… ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.;
హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తాజాగా 2025లో.. అత్యుత్తమంగా నిలిచిన నటీనటులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్టార్ గేజ్ – THR ఇండియా రౌండ్‌టేబుల్ అనే పేరు పెట్టారు. ఈ రౌండ్‌టేబుల్‌లో భాగంగా విడుదలైన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు… ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.
ఈ చర్చలో ధ్రువ్ విక్రమ్, ఇషాన్ ఖట్టర్, కృతి సనన్, విక్కీ కౌశల్, కల్యాణి ప్రియదర్శన్, బాసిల్ జోసెఫ్, రుక్మిణి వసంత్ పాల్గొన్నారు. వీరంతా వేర్వేరు భాషల సినీ పరిశ్రమలకు చెందినవారు అయినప్పటికీ.. తమ అద్భుతమైన నటనతో 2025లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ రౌండ్‌టేబుల్ చర్చలో వారు తమ కెరీర్‌లో ఎదురైన అనుభవాలు.. కష్టాలు.. విజయాలు గురించి ఓపెన్‌గా మాట్లాడారు. మంచి పాత్రలను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కూడా వివరించారు. అన్నిటికన్నా ముఖ్యంగా.. 2025 సంవత్సరం తమ జీవితాల్లో ఎలా మార్పులు తీసుకొచ్చిందో ఈ సందర్భంగా వారు ఓపెన్‌గా మాట్లాడారు.
ఇక ప్రస్తుతం ఈ ఈవెంట్ కోసం వీళ్లు వేసుకున్న డ్రెస్సులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బైసన్ చిత్రంతో మంచి విజయం అందుకున్న ధ్రువ్ విక్రమ్ బ్లాక్ షేడ్స్ బిస్పోక్ రూపొందించిన కస్టమ్ దుస్తుల్లో కనిపించారు.
ఇక ఇషాన్ ఖట్టర్ కాల్విన్ క్లైన్ జాకెట్, జీన్స్ ధరించారు. కార్టియర్ వాచ్.. ఇటాలియన్ షూస్ కంపెనీ షూస్ ఆయన లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కృతి సనన్.. సమీర్ మదన్ డిజైన్ చేసిన దుస్తులు ధరించగా.. సుకృతి గ్రోవర్, సీనియర్ స్టైలిస్ట్ వాణి గుప్తా.. ఆమెకు స్టైలింగ్ చేశారు. విక్కీ కౌశల్ కూడా ఈ ఫోటోలలో ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు.
ఇక ఈ సంవత్సరం కొత్త లోక్ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న.. కల్యాణి ప్రియదర్శన్.. రోహిత్ గాంధీ డిజైన్ చేసిన డ్రెస్ ధరించారు.
బాసిల్ జోసెఫ్ బ్లాక్ షేడ్స్ బిస్పోక్ కస్టమ్ సూట్‌లో కనిపించారు. కాగా కాంతారా చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న.. రుక్మిణి వసంత్ సునైనా ఖేరా డిజైన్ చేసిన దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు..
ఈ రౌండ్‌టేబుల్‌కు అవర్ణ జైన్ చైర్‌పర్సన్‌గా ఉండగా, అనుపమ చోప్రా ఎడిటర్‌గా వ్యవహరించారు. ఫాతిమా బలూచ్, నుపూర్ పి, టీమ్ ఈ క్రియేటివ్ డైరెక్షన్ అందించారు.