బ‌న్నీ పై మ‌న‌సు పారేసుకున్న హాట్ సింగ‌ర్

Update: 2020-12-20 07:15 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సుల‌కు ప్ర‌పంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఇటీవ‌లే బాలీవుడ్ ట్యాలెంటెడ్ డ్యాన్సింగ్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్ అంత‌టివాడు అల్లు అర్జున్ డ్యాన్సులంటే ఇష్టం అని అన్నారు. అనంత‌మైన‌ అభిమానులు ఓవైపు..దాంతోపాటే అనేక మంది సౌత్ బాలీవుడ్ తారలు కూడా బ‌న్ని నృత్యాలను ఆరాధిస్తారు. ప్రముఖ యువ‌గాయ‌ని కం పాటల రచయిత ఆస్తా గిల్ ఇప్పుడు బ‌న్ని అభిమానుల జాబితాలో చేరింది.  `అల వైకుంఠపుర‌ములో` స్టార్ బ‌న్నీకి పెద్ద అభిమాని అని ఆస్తా స్వ‌యంగా పేర్కొన్నారు.

``నేను అల్లు అర్జున్ న‌టించే సినిమాకి పాడాలని ఆశిస్తున్నాను. తద్వారా అతను నా సంగీతానికి అల‌వాటు ప‌డ‌తారు`` అని ఆస్తా ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇంట‌ర్వ్యూలో అన్నారు. నా కల నిజమవుతుందని ఆశిస్తున్నాన‌ని అన్నారు ఆస్తా. స‌ద‌రు పంజాబీ గాయ‌ని తెలుగు సినిమాల్లో పాడటానికి ఇష్టపడుతుందని.. భాష తెలియకపోయినా ఆసక్తి‌గా ఉంద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఆస్తా ప్రముఖ పంజాబీ కళాకారులు దిల్జిత్ దోసంజ్... బాద్షాల‌తో కలిసి పనిచేశారు. బాలీవుడ్ సినిమాల్లో అనేక పాటలు పాడారు. ప్ర‌స్తుతం సౌత్ పై దృష్టి సారించిన ఈ హాట్ సింగర్ తెలుగులో బ‌న్నీ సినిమాకి పాడాల‌ని భావిస్తున్నారు. మ‌రి బ‌న్ని త‌న పిలుపు విని స్పందిస్తారా లేదా?  పుష్ప చిత్రానికి పాడే ఆఫ‌ర్ ఇస్తున్నారా లేదా చూడాలి.
Tags:    

Similar News