పోలీసుల చేతిలో ఆ హీరోకు చిక్కులు తప్పవా?
అతి చేసి అజ్ఞాతంలో ఉంటున్న తమిళ హీరో శింబు తన సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాడు. త్వరలో విడుదల కావాల్సిన ఆయన సినిమా గురించి ఈ యువ హీరో ఉత్కంఠ పెడుతున్నాడు అనుకోకండి. స్త్రీలను కించపరిచేలా అసభ్యపదాలతో పాట రాయడమే కాకుండా ఆ పాటను స్వయంగా పాడటం ద్వారా వివాదంలో పడ్డ శింబూ...ఆ కేసును కొలిక్కి తేవడంలో డైలమా కొనసాగిస్తున్నాడు. శింబు రాసి పాడిన ఈ పాటకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. శింబు-అనిరుద్ ల వల్ల మార్కెట్ లోకి వచ్చిన పాట తమను అవమానించేలా ఉందంటూ తమిళనాడులోని మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. చెన్నైతో సహా అన్ని చోట్లా మహిళా సంఘాల నేతలను శింబుపై కేసులు పెట్టారు.
దీంతో ఖంగుతిన్న శింబూ అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆయనతో ఏకీభవించడంతో అరెస్ట్ తప్పిపోయింది. కానీ శింబు మళ్లీ చేసిన అతితో కొత్త చిక్కు వచ్చింది. ఇక ముందు తనపై కేసులు నమోదు కాకుండా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ దఫా హైకోర్టు ఆయన్ను కనికరించకుండా పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.
కోర్టు నో చెప్పిన నేపథ్యంలో శింబు చెన్నై పోలీసుల ముందు హాజరు అయ్యి తన వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే హాజరీని తప్పించుకునేందుకు శింబు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. మొత్తంగా శింబు హాజరవుతాడా? లేక లాయర్ ద్వారా తన వాదనలు వినిపిస్తాడా అనే చర్చ ఇటు సినీ ఇండస్ర్టీలోనూ అటు పోలీసు వర్గాల్లోనూ జరుగుతోంది.