• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రోల్స్ నుంచి టాప్ లైనప్...

ట్రోల్స్ నుంచి టాప్ లైనప్ వరకు!

| టాలీవుడ్‌లో యంగ్ హీరోల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో, తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తున్న నటుడు కిరణ్ అబ్బవరం.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-06-21 09:59 GMT

టాలీవుడ్‌లో యంగ్ హీరోల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో, తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తున్న నటుడు కిరణ్ అబ్బవరం. ఒకప్పుడు వరుస ఫ్లాప్‌లు, సోషల్ మీడియా ట్రోల్స్, మార్కెట్‌పై అనుమానాల మధ్య ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితిని ఆస్వాదిస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా నిలిచింది మాత్రం క సినిమానే. ఈ సినిమా రిలీజ్ కు ముందు కిరణ్ అబ్బవరం కెరీర్‌పై అనేక ప్రశ్నలు వినిపించాయి. వరుస సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో ఆయన ఫ్యూచ‌ర్ కెరీర్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే క సినిమా కేవలం కమర్షియల్ స‌క్సెస్‌నే కాదు, కిరణ్‌పై ఇండస్ట్రీలో ఉన్న అభిప్రాయాన్ని కూడా మార్చేసింది. ముఖ్యంగా కథల ఎంపికలో కొత్త దృక్పథాన్ని చూపించగలడనే నమ్మకాన్ని ఈ సినిమా తీసుకొచ్చింది. అదే సమయంలో కిరణ్‌లో కూడా ఆ సినిమా కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ఈ స‌క్సెస్ తో కిరణ్ అబ్బవరం ఆగకుండా తన కెరీర్‌ను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. హీరోగా సినిమాలు చేయడమే కాకుండా, నిర్మాతగా మరియు డైరెక్ట‌ర్ గా కూడా తన సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న రియాలిటీ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక నటుడు స్వయంగా కథపై నమ్మకంతో మెగాఫోన్ పట్టడ‌మ‌నేది చిన్న విషయం కాదు. దీంతో కిరణ్ తనపై ఉన్న విశ్వాసాన్ని మరింత బలంగా చాటుతున్నారని చెప్పాలి.

అదే సమయంలో నిర్మాతగా కూడా ఆయన కొత్త ప్లాన్స్ రూపొందిస్తున్నారు. ఒకవైపు చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ కు సిద్ధమవుతుండగా, మరోవైపు క2 స్క్రిప్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. క ఇచ్చిన స‌క్సెస్ ఆ ఫ్రాంచైజీ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, సుకుమార్ రైటింగ్స్‌లో రూపొందబోయే కొత్త ప్రాజెక్ట్ కూడా కిరణ్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. సినిమాలతో పాటు ఓటీటీ రంగంలో కూడా కిరణ్ అడుగులు వేస్తున్నారు. డియ‌ర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గువ్వల చెరువు ఘాట్ వెబ్ సిరీస్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే కాంతార టీమ్‌కు చెందిన శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో రూపొందనున్న మిస్టికల్ థ్రిల్లర్ ఆయన తొలి పాన్ ఇండియా ప్రయత్నంగా నిలవనుంది.

ఒకప్పుడు ట్రోల్స్‌కు టార్గెట్ అయిన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు తన లైనప్‌తోనే చర్చనీయాంశంగా మారడం విశేషం. హీరోగా మాత్రమే కాకుండా డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్, ఓటీటీ యాక్ట‌ర్, పాన్ ఇండియా హీరోగా విభిన్న మార్గాల్లో ముందుకు సాగుతున్న ఆయన ప్రయాణం చూస్తుంటే, క సినిమా నిజంగానే ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ భారీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలిగితే, యంగ్ హీరోల రేసులో కిరణ్ అబ్బవరం మరింత బలమైన స్థానాన్ని సంపాదించే అవకాశం కనిపిస్తోంది.

Tags:    
  • kiranabbavaram 
  • tollywood 
  • telugucinema 
  • kamovie 
  • ka 
  • ott 
  • panindia 
  • telugumovies 
  • filmnews 
  • entertainmentnews 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS