ఈసారి సైమాలో డోస్‌ పెంచేశారు

Update: 2015-07-02 09:30 GMT
ఇండియా మొత్తంగా పేరున్న అవార్డులు ఏమైనా ఉన్నాయా అంటే.. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఇచ్చే నేషనల్‌ అవార్డ్స్‌ తరువాత, ఫిలింఫేర్‌ అవార్డులే. కాకపోతే మన స్టేట్స్‌ వరకు చూసుకుంటే మొన్నటివరకు నంది అవార్డులు చాలా గొప్పవి. కాని ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వాటి ఊసే లేదు. ఇకపోతే ప్రైవేట్‌ అవార్డ్సు చాలానే ఉన్నాయ్‌. ఫిలింఫేర్‌ తరహాలో బాలీవుడ్‌లో చాలా కాస్ట్‌లీ అవార్డులు వచ్చేశాయి. ఐఫా అని, స్టార్‌ స్క్రీన్‌ అవార్డులనీ.. అబ్బో చాలా ఉన్నాయ్‌. కాని సౌత్‌కు వచ్చేసరికి.. అదీ తెలుగుకు వచ్చేసరికి.. మా అవార్డ్సు, సంతోషం, జీ తెలుగు అవార్డులు.. ఎందుకో అంత కిక్కివ్వట్లేదు. ఇలాంటి సమయంలో మన సౌత్‌లోని నాలుగు ఉడ్స్‌ను కలుపుతూ వచ్చిన అవార్డులే ఈ సౌమా అవార్డులు.

ప్రతీ ఏటా జరిగినట్లే ఈసారి కూడా సైత్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ అవార్డులు చాలా ఘనంగా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈసారి సదరు అవార్డుల కార్యక్రమం దుబాయ్‌లో జరగనుంది. ఎప్పటిలాగానే శ్రీయ, రానా లు ఈ ప్రోగ్రాంకు అంబాసిడర్లుగా ఉన్నారు కాని.. ఈసారి మాత్రం హీరోయిన్ల మోతాదు బాగానే పెరిగింది. కొత్త కొత్తగా వస్తున్న భామలైన పూజా హెగ్డే, అదా శర్మ మొదలగు భామలు ఈసారి తమ డ్యాన్సులతో ఇరగదీస్తారట. ఎలాగో శ్రీయ, కృతికర్భందా మొదలగు స్టార్లు లాస్ట్‌ ఇయర్‌ రఫ్ఫాడించినట్లే స్టేజ్‌ను ఇప్పుడు కూడా రఫ్ఫాడిస్తారులే. కాని మ్యాటర్‌ ఏంటంటే.. ఏకంగా 20 మంది హీరోయిన్లు ఈసారి రెండు రోజుల్లో పెర్‌ఫామ్‌ చేయనున్నారు. ఇలా జరగడం ఇదే మొదటసారి. మొత్తానికి సౌత్‌ టిన్సెల్‌ టౌన్స్‌కు కూడా చెప్పుకోవడానికి ఇప్పుడు సూపర్‌డూపర్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌ ఒకటి వస్తోందని అనుకోవాలేమో.

Tags:    

Similar News